– దరఖాస్తులకు అక్టోబర్ 20 వ తేదీ తుది గడువు
గిరిజన సంక్షేమ శాఖ అధ్వర్యంలోసిద్ధిపేట జిల్లాలోని
నిరుద్యోగ యువతకు హైదరాబాద్ లోని జాతీయ నిర్మాణ సంస్థ(న్యాక్) నందు వివిధ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి తెలిపారు.
ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు.
3 నెలల ఫినిషింగ్ స్కూల్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో శిక్షణకు బీటెక్/బీఈ(సివిల్), సూపర్వైజర్ స్ట్రక్చర్స్కు ఇంటర్, ఐటీఐ(సివిల్), డిప్లమా(సివిల్) పూర్తిచేసి 21-35 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని అన్నారు.
ఇతర పూర్తి వివరాలకు తమ సంస్థ వెబ్సైట్ను సందర్శించాలని కోరారు.
దరఖాస్తుల సమర్పణ కు అక్టోబర్ 20 వ తేదీ తుది గడువు అని తెలిపారు.
ఆసక్తి,అర్హత కలిగిన అభ్యర్థులు
www.nac.edu.in లేదా https://tstribalwelfare.cgg.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఫిరంగి తెలిపారు.