గిరిజన ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు..

ప్రచురణార్థం

గిరిజన ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు…

మహబూబాబాద్, అక్టోబర్ 12.

గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న నిరుపేద గిరిజనులకు వైద్య ఖర్చులు తగ్గించాలని ఆధునిక వైద్య సేవలు పెంపొందించాలని నిరంతరం తపిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

మంగళవారం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద సుమారు 2 కోట్లతో ఆక్స్ ఫామ్ సంస్థతోపాటు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన ఆక్సిజన్ ప్లాంట్ ను జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి లతో కలిసి మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి మాట్లాడుతూ… గిరిజన ప్రాంతాలలో నివసించే నిరుపేదలకు వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడంతో కోవిద్ రాకతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటు ఎంపీ నిధులు 85 లక్షలతో పల్స్ ఆక్స్ మీటర్లు ధర్మ మీటర్ లు పి పి కిట్స్, ఎన్.95 మాస్కులు వైద్య శాఖ కు అందజేసినట్లు తెలిపారు.

ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, దాతల సహకారంతో ఏర్పాటు చేస్తూ, శాశ్వత పరిష్కారం కొరకు ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోగా ఆక్స్ ఫామ్ సహకారం లభించిందన్నారు. ఆక్స్ ఫామ్ ద్వారా రూ 1.63 కోట్లతో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ midc ద్వారా కావాల్సిన వసతుల కొరకు 40 లక్షలతో విద్యుదీకరణ, షెడ్ నిర్మాణ పనులు చేపట్టినట్లు వివరించారు.

తెలంగాణ
డయాగ్నస్టిక్ హబ్ నిర్మాణంతో 57 రకాల రక్త పరీక్షలు ఉచితంగా నిరుపేదలకు అందుబాటులోకి తెచ్చామన్నారు.

ఇదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు జిల్లా కు మెడికల్ కళాశాల మంజూరు చేయగా జిల్లా కేంద్రంలో 30 ఎకరాలలో నిర్మించతల పెట్టామని , 30 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు టెండర్ దశలో ఉన్నాయన్నారు.

వైద్య కళాశాల మంజూరు కై నిబంధనల మేరకు తనిఖీ బృందం రానున్నందున బోధన హాస్పిటల్ కళాశాలగా 300 పడకల కొరకు అదనపు బెడ్స్ నిర్మాణం చేపట్టామన్నారు.

ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పైభాగంలో అదనపు పడకల నిర్మాణము చేపట్టినట్లు మంత్రి తెలియజేశారు.

కోవిడ్ రాకతో వైద్య సేవ సౌకర్యాలను మెరుగుపరచాలని నిరుపేదలకు అందుబాటులోకి తీసుకురావాలనే బృహత్ సంకల్పం తో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల సమస్యలను స్వయంగా పరిష్కరిస్తామన్నారు అదేవిధంగా కొత్తగా 57 సంవత్సరములు నిండిన వృద్ధులకు పింఛన్లు మంజూరు చేస్తామన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక మాట్లాడుతూ నిమిషానికి 600 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని, 80 నుండి 100 బెడ్స్ కు ఆక్సిజన్ అందుతుందన్నారు. భవిష్యత్ లో ఆక్సిజన్ కొరత రాదన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎంపి శ్రీమతి కవిత , మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రాములు, ఆక్స్ ఫామ్ సంస్థ ప్రతినిధులు ఎస్.పి. మిశ్రా, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
——————————–_
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం,మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post