ప్రచురణార్థం
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తృతంగా పెంచాలి…
మహబూబాబాద్ ఆగస్టు 26.
సీజనల్ వ్యాధులు నిరోధించేందుకు మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మరింతగా పెంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.
గురువారం కలెక్టర్ కార్యాలయంలో సీజనల్ వ్యాధులు covid 19 లపై ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి నిల్వ ఉండే ప్రాంతాల్లో గంబుషియ చేప పిల్లలను గ్రామపంచాయతీ మల్టిపర్పస్ వర్కర్స్ తో విడిచిపెట్టించాలని, మురికినీటి ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయించాలన్నారు.
జ్వరాలతో ఉన్నవారి వైద్యం అందించేందుకు రక్త నమూనాల శ్యాంపిల్స్ సేకరించి ఆర్.టి.పి.సి.ఆర్ ల్యాబ్ కు పంపించాలన్నారు.
వ్యవసాయ పనులు జరుగుతున్నందున వైద్య సిబ్బంది ఉదయమే గ్రామాలలో సందర్శించి వైద్య సేవలు అందించాలన్నారు.
ఫ్రై డే డ్రై డే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని, పారిశుధ్యాన్ని మెరుగు పరచాలని జిల్లా పంచాయతీ అధికారి ని ఆదేశించారు.
కురవి, గార్ల, డోర్నకల్, మండలాల్లో అన్ని గ్రామ పంచాయతీ లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, గిరిజన ప్రాంతాల్లో అదనంగా ఏర్పాటు చేయాలన్నారు. గూడూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో డెంగ్యూ వైద్య సేవల నిమిత్తం 5 బెడ్స్ తో విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలియజేసారు.అదే విధంగా అవసరమైన చోట ల్యాబ్ టెక్నీషియన్ లను పంపించాలని ఉప వైద్యాధికారిని ఆదేశించారు.
సెప్టెంబర్ 1వ తేదీన పాఠశాలలను పునఃప్రారంభం కానున్నందున పాఠశాలలను వైద్యాధికారులు సందర్శించి ఆశ వర్కర్స్, ఏ. ఎన్. ఎమ్. లకు పల్స్ ఆక్సో మీటర్లు, ఐ.ఆర్.ధర్మామీటర్స్ అందజేయాలని, అంతేగాక పనిచేసే విధానాన్ని పాఠశాలలో బాధ్యులైన ఒకరికి శిక్షణ ఇవ్వాలన్నారు. చేతులు శుభ్ర పరుచుకునే విధానాన్ని తెలియజేయాలన్నారు.
కోవిడ్ 19 పై సమీక్షిస్తూ హై రిస్క్ గా బయ్యారం మండలం లోని కోయగూడెం, కేసముద్రం లపై దృష్టి పెట్టాలన్నారు. వెసులుబాటు లేనివారిని ఐసోలేషన్ కేంద్రంలో ఉంచాలన్నారు.
కోవిడ్ పై అజాగ్రత్తగా ఉండరాదని మాస్క్ ఎన్ఫోర్స్ మెంట్ చేపట్టాలని, సాని టైజర్ వినియోగిస్తూ, సామాజిక దూరం పాటించాలన్నారు.
కోవిడ్ టీకా కొరకు సబ్ సెంటర్లు, రైతు వేదికలు వినియోగించు కోవాలన్నారు. అర్హులైన వారందరికీ 1వ డోస్,2వ డోస్ వేయాలన్నారు.
ప్రతి మండల స్థాయి సమావేశాల్లో కోవిడ్ పై అవగాహన పరచాలని, వేడుకలకు, పండుగలకు దూరంగా ఉండాలని కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, డి.పి.ఓ. రఘువరన్, జిల్లా మలేరియా అధికారి సుధీర్ రెడ్డి, ఉప వైద్యాధికారి అంబరీష్, కోవిడ్ నోడల్ అధికారి విక్రమ్, కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు అశోక్ పాల్గొన్నారు.
———————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, మహబూబాబాద్ చే జారిచేయనైనది.