గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం:: రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్

గిరిజన ప్రాంత అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం:: రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్

ప్రచురణార్థం

మహబూబాబాద్,
కొత్తగూడ మండలం , మార్చి 24.

గిరిజన ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ తెలిపారు .

శుక్రవారం జిల్లాలోని అత్యంత మారుమూల ప్రాంతమైన ఏజెన్సీ ప్రాంతంలోని కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో ఐటీడీఏ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీకారం చుట్టారు.

జిల్లా కలెక్టర్ శశాంక జడ్పీ చైర్మన్ ఆంగోత్ బిందు ములుగు శాసనసభ్యులు సీతక్క లతో కలిసి మంత్రి సుమారు 70 లక్షలతో బిటి రోడ్డు, 20 లక్షలతో నిర్మించే గ్రామపంచాయతీ భవనం లకు శంకుస్థాపన చేశారు. అనంతరం భవన నిర్మాణం పనులకు భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయమన్నారు. నీటి ఎద్దడి పై నీటిపారుదల ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు అనంతరం ప్రజలతో మాట్లాడుతూ
గిరిజన ప్రజలకు పాకాల చెరువు నీటిపై ఎత్తిపోతల పథకం నిర్మించి ఈ ప్రాంతంలోని గొలుసు కట్టు చెరువులన్నింటినీ సాగునీరు తో నింపుతామని తద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు త్రాగునీరు కొరత ఉండదన్నారు.

జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ గిరిజన యువత చదువుకోవాలన్నారు పిల్లల చదివే పెద్దలు ఆస్తిగా పరిగణించాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుమారి ఆంగోత్ బిందు ములుగు శాసన సభ్యురాలు సీతక్క ఐ టి డి ఏ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి హేమలత తాసిల్దార్ నరేష్ ఎంపీడీవో భారతి తదితరులు పాల్గొన్నారు.

Share This Post