గిరిజన సంక్షేమమే ఐటిడిఎ లక్ష్యం:జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య

* ప్రచురణార్థం *
ములుగు జిల్లా
డిసెంబర్ 7 ( మంగళవారం ).
గిరిజన సంక్షేమమే ఐటిడిఎ లక్ష్యమని శాఖల వారీగా అభివృద్ధి పథకాలు వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ మరియు ఇంచార్జి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కృష్ణ ఆదిత్య ఐటీడీఏ యూనిట్ అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ చాంబర్లో ఏపీఓ వసంతరావు తో కలిసి ఐటీడీఏ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి విద్య వైద్యం తో పాటు ఇంజనీరింగ్ శాఖల ద్వారా అభివృద్ధి పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులకు విద్య వైద్యం సకాలంలో అందించినప్పుడే చాలా వరకు అభివృద్ధి చేసిన వాళ్ళం అవుతామని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అత్యవసర పరిస్థితులలో రిఫర్ కేసులు కొరకు ఐటీడీఏ ద్వారా అంబులెన్సులు మంజూరు చేయడం జరిగిందని ఆ అంబులెన్స్లు గిరిజనులకు ఉపయోగపడాలి అన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మంజూరైన నిధులతో సిబ్బంది శాలరీలు, పెండింగ్ బిల్స్, పెండింగ్ వేజెస్ వెంటనే మంజూరు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. గిరిజన ప్రాంతాలలో మలేరియా కేసులపై దృష్టి సారించాలని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్స్ మూమెంట్ ,అడ్వాన్స్ టూర్ ప్రోగ్రాం, ప్రతి డాక్టరు ఎన్ని కేసులు పరిష్కారం చేశారు అనే విషయాలను వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం తెలియపరచాలి అన్నారు. అలాగే విద్య పరంగా కొన్ని సూచనలు చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ గిరిజన విద్యార్థిని విద్యార్థులకు అందించాలంటే ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలను పరిశీలించాలని స్కూల్ వారిగా యాక్షన్ ప్లాన్, స్పెషల్ క్లాసులు
తరగతి వారీగా, సబ్జెక్టు వారిగా యాక్షన్ ప్లాన్ తయారు చేసి విద్యా నైపుణ్యాలు మెరుగు పరుస్తున్నామని అన్నారు. ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాలు వారీగా ప్రతి రోజు గిరిజన విద్యార్థిని విద్యార్థులకు ప్రార్థన సమయం దగ్గర నుంచి , ఉదయం బ్రేక్ ఫాస్ట్ , మెనూ, ప్రత్యేక తరగతి బోధన అన్ని వివరాలను ఫొటోస్ రూపంలో వాట్సాప్ లో పంపించాలన్నారు.
కులాంతర వివాహంలకు సంబంధించిన దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి. ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉన్న నిధులు కనుగుణంగా వారికి అందించి ప్రభుత్వపరంగా ప్రోత్సాహం అందించాలన్నారు. గిరిజన సంక్షేమ గురుకులాల పై రివ్యూ చేస్తూ మరమ్మతులు మౌలిక వసతులు ప్రతిపాదనలు సిద్ధం చేసేటప్పుడు ప్రధానోపాధ్యాయులు ప్రిన్సిపాల్స్ సంతకం వ్రాతపూర్వకంగా ఉండేలా చూసుకోవాలన్నారు. గురుకులాలకు సంబంధించిన అన్ని మరమ్మతులు చేయించుకోవాలని తెలిపారు , గిరిజన సహకార సంస్థ జీసీసీ ద్వారా ప్రతి మండలానికి ఒక పెట్రోల్ బంక్ వచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇప్పటికే వివిధ మండలాల్లో పెట్రోల్ బంకులు పనులు నడుస్తున్నా యని, పనులు వేగం పెంచాలని, ప్రజలకు అందుబాటులో ఉన్న పెట్రోల్ బంకులు ద్వారా నాణ్యమైన డీజిల్, పెట్రోల్ పిఓఎల్ అందుబాటులో ఉంటుందని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. జి సి సి అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఇంజనీరింగ్ శాఖ ద్వారా గిరిజన అభివృద్ధి పై భవన సముదాయాలు పాఠశాలలు, నాణ్యత ప్రమాణాలతో నిర్మించి మౌలిక వసతులు కల్పిస్తుందని ఇంజనీరింగ్ శాఖ పనితీరును కలెక్టర్ ప్రశంసించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఐటిడిఎ ఏ ఓ రఘు, డిటిడిఓ ఎర్రయ్య, EE హేమలత,
ఎస్డిసి శ్రీ రాములు, ఎస్.ఓ., రాజ్ కుమార్, డిప్యూటీ డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జిసిసి డియం విజయ్ కుమార్, అర్సిఒ రాజలక్ష్మి.,వెంకన్న,ఏసీయంఓ సారయ్య, సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

Share This Post