గిరిజన సంక్షేమానికి ప్రభుత్వ చర్యలు:: రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

 ప్రచురణార్ధం

మే 24 ఖమ్మం

గిరిజన సంక్షేమానికి ప్రభుత్వ చర్యలు:: రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్         గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, వికాసానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే చర్యలు చేపడ్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లాలో రూ.42.50 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తో కలిసి శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో ఖమ్మం నగరంలోని ఎన్ఎస్సి క్యాంపులో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన గిరిజన భవన్ ప్రారంభోత్సవం, రూ.20 కోట్ల అంచనా వ్యయంతో రఘునాథపాలెం మండల కేంద్రంలో నిర్మించనున్న ప్రతిభా విద్యాలయం (స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సీ), రూ.21,02 కోట్ల వ్యయంతో వైరా నియోజకవర్గం సింగరేణి మండలం రేలకాయలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణ పనులకు శంఖుస్థాపనలు ఉన్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యపతి రాథోడ్ మాట్లాడుతూ, గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రఘునాథపాలెంలో స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సిలో గిరిజన బిడ్డలకు అవకాశాలు వస్తాయని అన్నారు. తెలంగాణ ప్రజల ఆర్తి తెలిసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆమె అన్నారు. అభివృద్ధి గురించి మాట్లాడాలంటే రాష్ట్రం అంత అవసరం లేదు ఖమ్మం చూస్తే అర్ధమవుతుందని ఆమె తెలిపారు. ఆడబిడ్డ గర్భం దాల్చితే సొంత మేనమామలే మొహం చాటేస్తున్న నేటి రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్రావు కళ్యాణ లక్ష్మి చెక్కుతో లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారన్నారు. 20 కోట్లతో స్కూలు ఆఫ్ ఎక్సలెన్సీని గిరిజన బిడ్డలకు పెట్టడం గొప్ప విషయమని ఆమె అన్నారు. గిరిజన బిడ్డలకు మంచి భోజనం పెట్టి, మంచి విద్యను అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్ముల ఆలోచన అని మంత్రి తెలిపారు. 3146 తండా గ్రామాలను గ్రామపంచాయితీలుగా మార్చామని, రఘునాథపాలెంలో కొత్తగా ఏర్పడ్డ 19తో పాటు జిల్లాలోని భవనాలు లేని గ్రామ పంచాయితీలను భవన నిర్మాణానికి 25 లక్షల రూపాయలు. మంజూరు చేస్తామన్నారు. గిరిజనుల అవసరాలు తెలుసుకొని, వారు సమాజంలో అందరితో సమానంగా వృద్ధిలోకి తేవడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అన్నారు. విద్యతోనే గిరిజనుల వికాసం అని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 273 గురుకులాలు ఉండగా, ఇప్పుడు 976 గురుకులాలు ఉన్నాయన్నారు. ఒక్కో విద్యార్థికి 1.20 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు, విదేశాల్లో విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ పథకం అమలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గిరిజన భవన్ పైఅంతస్తులో కళ్యాణ మండపం సమావేశ మందిరాల నిర్మాణానికి 60 లక్షలు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 200 కోట్లతో రోడ్లు మంజూరు చేసుకున్నట్లు, 3 పేజ్ కరెంటు లేని గిరిజన ప్రాంతాల్లో రూ. 221 కోట్లతో పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు భీమా, దళితబంధు తదితర ఎన్నో పథకాల అమలుతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలం నియోజకవర్గంలో ఉన్న ఏటపాకలో ఉన్న ప్రతిభా విద్యాలయ భవనాన్ని వదిలేసి, విద్యాలయాన్ని జిల్లాకు తీసుకువచ్చినట్లు, 8వ తరగతి నుండి ఇంటర్ వరకు ఖమ్మంలో అద్దె భవనంలో నిర్వహిస్తుండగా, రఘునాధపాలెం మండల కేంద్రంలో 6 ఎకరాల స్థలం గుర్తించి, రూ. 20 కోట్ల వ్యయంతో భవనాల నిర్మాణానికి శంఖుస్థాపన చేశామన్నారు. ప్రయివేటుకు దీటుగా భోజనం, చదువు అన్ని వసతులతో రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామన్నారు. చదువుతోనే బంగారు భవిష్యత్తు అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2 ప్రతిభా విద్యాలయాలు ఉండగా, ఒకటి హైదరాబాద్లో, రెండోది రఘునాథపాలెంలో వున్నాయన్నారు. రాబోయే రోజుల్లో నీట్ పరీక్షలకు సిద్ధానికి చర్యలు చేపట్టి, పిల్లలను డాక్టర్లుగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. సంవత్సరం లోగా భవనాల పూర్తికి చర్యలు చేపట్టాలన్నారు. పిల్లల భవిష్యత్తు కోసం అన్ని రకాల సంస్థల స్థాపనకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఖమ్మంలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఆమోదం లభించినట్లు, త్వరలో ప్రారంభోత్సవానికి చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లో సిసి రోడ్స్, డ్రైన్స్ అన్ని రకాల అభివృద్ధి పనులు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతు బంధు, దళితబంధు, రైతు భీమాలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ తో అన్ని రాష్ట్రాలు అంధకారంలో ఉండగా, తెలంగాణ రాష్ట్రం ద్విగుణీకృతంగా వెలుగుతున్నట్లు మంత్రి అన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఖమ్మం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, అభివృద్ధిలో ముందంజలో ఉన్నామన్నారు. పట్టణంలోనే మంచి గిరిజన భవన్ నిర్మించుకున్నామన్నారు. ఢిల్లీ విద్యా సంస్థలకు దీటుగా విద్యా సంస్థలను ఏర్పాటుచేసుకుంటున్నట్లు ఎంపీ. అన్నారు. ఒక ప్రక్క రైతులకు, బడుగు బలహీన వర్గాలు, దళితుల అభివృద్ధికి చర్యలు చేపడుతూ, దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. ప్రపంచం అంతా తెలంగాణ వైపు దృష్టి పెట్టినట్లు, పార్టీలకతీతంగా అర్హులందరికీ పథకాలు, ఫలాలు అందజేస్తున్నట్లు ఆయన అన్నారు.

ఈ సందర్భంగా గిరివికాసం పథకం క్రింద జిల్లా వ్యాప్తంగా 243 మంది లబ్ధిదారులకు మంజూరైన బోర్వెల్స్, 61 మందికి ట్యూబ్వెల్స్న లబ్ధిదారులకు మంత్రులు పంపిణీ చేసారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జొహరా, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాద్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, అధికారులు, కార్పోరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post