గిరిజన సంక్షేమ అభివృద్ధి పథకాలు, అర్హులైన గిరిజనులకు చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని:జిల్లా కలెక్టర్ మరియు ఇన్చార్జ్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య అధికారులను ఆదేశించారు

గిరిజన సంక్షేమ అభివృద్ధి పథకాలు, అర్హులైన గిరిజనులకు చేకూరే విధంగా చర్యలు చేపట్టాలని
సోమవారం ఐటీడీఏ కార్యాలయం లో వివిధ మండలాల స్పెషలాఫీసర్ యూనిట్ అధికారులతో శాఖల వారీగా అభివృద్ధి కార్యక్రమాల వివరాలను రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యా నైపుణ్యాలు ఇంప్రూవ్ కావాలంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హైకోర్ట్ పెండింగ్ కేసులపై చర్యలు చేపట్టాలని, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల వారీగా డ్రాపౌట్స్ లేకుండా విద్యార్థుల హాజరు వివరాలు అందజేయాలన్నారు ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల పై ప్రత్యేక దృష్టి సారించి పర్యవేక్షించాలి అన్నారు ఏ ఒక్క విద్యార్థి చైల్డ్ లేబర్ గా మారకూడదని, ఏ ఒక్క విద్యార్థి చదువులో వెనుకబడ కూడదు అని ,మై గ్రేటే డ్ విద్యార్థుల వివరాలు, పిల్లల ఆరోగ్య పరిస్థితి పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చర్యలు చేపట్టాలన్నారు నాణ్యమైన మేను అందిస్తూ ప్రత్యేక తరగతులు ద్వారా విద్యాబోధన చేపట్టాలని ఆదేశించారు హెడ్ ఆఫ్ ఎకౌంట్ వారీగా బడ్జెట్ కు సంబంధించిన వివరాలు తెలియజేయాలని ఇంజనీరింగ్ శాఖ ద్వారా ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఆశ్రమ పాఠశాల భవనాలను పూర్తి చేసుకోవాలని అన్నారు గిరిజన అభివృద్ధి పథకాలు వేగవంతం కావాలంటే ఐటీడీఏ యూనిట్ అధికారులు మనసుపెట్టి పనిచేయాలని
అన్నారు.

ఈ కార్యక్రమంలో, sdc ట్రైబల్ వెల్ఫేర్ శ్రీ రాములు ,డిడి ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య,E.E ట్రైబల్ వెల్ఫేర్ హేమలత ఎస్ వో రాజ్ కుమార్ , ఐటీడీఏ పరిపాలనాధికారి దామోదర్ స్వామి ఐటీడీఏ మేనేజర్ లాల్ నాయక్, సంబంధిత ప అధికారులు పాల్గొన్నారు

Share This Post