గిరివికాసం పథకంలో భాగంగా జిల్లాలో గిరిజనుల భూములను గుర్తించి వాటిని తరి పొలాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

గిరివికాసం పథకంలో భాగంగా జిల్లాలో గిరిజనుల భూములను గుర్తించి వాటిని తరి పొలాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మండల అభివృద్ధి అధికారులను ఆదేశించారు.  మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపిడిఒ లు, ఎ.పిడి లు,  ఎపిఒ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సమీక్షలో సి.యం. గిరివికాసం, జల శక్తి అభియాన్, ఉపాధిహామీ పనులు, హరితహారం, నర్సరిల ఏర్పాటు తో పాటుగా వారం రోజుల నుండి జిల్లాలో పర్యటించిన కేంద్ర గ్రామీనాభివ్రుద్ధి పర్యవేక్షణ కమిటి నివేదిక పై అదనపు కలెక్టర్ మను చౌదరి తో  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ గిరివికాసం పథకం గురించి  వివరిస్తూ ఇప్పటి వరకు గిరిజనులు తమ సాగు భూమిలో బోర్ వెల్ కొరకు దరఖాస్తు చేసుకునేవారని కానీ ఈ పథకం ప్రకారం మండల అభివృద్ధి అధికారులే జిల్లాలోని గిరిజనుల భూములు ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే చోట 5 ఎకరాలకు తగ్గకుండా ఉన్న వారిని లబ్దిదారులగా  గుర్తించి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఇద్దరు ముగ్గురికి కలిపి పక్క పక్కన అయిదు ఎకరాలకు పైన భూమి కలిగిన గిరిజనులకు అక్కడ ఉచితంగా బోర్ వెల్ వేయడం, విద్యుతు కేనేక్షన్ ఇవ్వడం, మోటారు బిగించి ఇవ్వడం జరుగుతుందన్నారు.  సాగుకు పనికి రాని భూమి ఉన్న వాటిని బాగు చేసి సాగులోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందువల్ల ముందుగ గిరిజనుల భుములు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి  ప్రాథమిక నివేదిక తయారు చేసి ఇవ్వలసిందిగా ఆదేశించారు.

జలశక్తి అభియాన్ లో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాల వద్ద ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  భవనాల పై కప్పు పై పడే ప్రతి నీటి చుక్కను పైప్ లైన్ ద్వారా ఒకదగ్గరికి తీసుకెళ్ళి అక్కడే ఇంకుడుగుంతలో ఇంకే విధంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు.  ప్రతి గ్రామంలో కమ్యూనిటి ఇంకుడు గుంతలు, వ్యక్తీ గత ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునే విధంగా ప్రజలకు అవగాహ కల్పించాలని ఆదేశించారు.

ఉపాధి హామీ పథకము పై చర్చిస్తూ జిల్లాలో ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒకరికి వంద రోజుల పని కల్పించే విధంగా గ్రామాల్లో పనులను చేపట్టాలని ఆదేశించారు.  ఎక్కువ మందికి పని కల్పించడం తో పాటు పని చేసిన దానికి అధిక మోత్తం లో కూలి పడే విధంగా పనులు ఉండాలని సూచించారు.  చేసిన పనికి ఎప్పటికప్పుడు ఎఫ్.టి.వో లు అప్లోడ్ చేసి సకాలంలో కూలి అకౌంట్ లో జమ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.  పోస్ట్ ఆఫీసు అకౌంట్ ఉన్న అందరు ఉపాధి హామీ కులిల అకౌంట్ లు బ్యాంక్ అకౌంట్ లకు మార్చాలని తెలియజేసారు.  ఈ ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని కాని కొంత మంది అధికారులు నిర్లక్షం చేస్తున్నారని అలాంటి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

హరితాహారం లో నాటిన మొక్కలు వంద శాతం జీవించి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా ఏదేని కారణంగా చనిపోయిన మొక్కల స్థానంలో వేరే మొక్కలు పెట్టాలని ఆదేశించారు.  నాటిన మొక్కలకు ఇప్పటి వరకు కేవలం 54 శాతం మాత్రమే పేమెంట్ చేయడం జరిగిందని మిగిలిన వాటికి వెంటనే ఎఫ్.టి.ఓ లు అప్లోడ్  చేసి పేమెంట్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. బృహత్ పల్లె ప్రక్రుతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమమ పూర్తి చేయాలనీ సూచించారు.

వచ్చే హరితహారానికి కావలసిన  మొక్కలు ఎ గ్రామా పంచాయతీకి అదే గ్రామ పంచాయతి లో నర్సరీ ల ద్వారా మొక్కలు పెంచుకునే విధంగా ఇప్పటి నుండే నర్సరీలు ప్రారంభించాలని ఆదేశించారు.  నర్సరీ స్థలాలను గుర్తించి శుబ్రం చేసి చుట్టూ కంచే, సూచిక బోర్డ్ ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాలని వారం రోజుల్లో పాలతిన్ కవర్లు సరఫరా చేయడం జరుగుతుందని వెంటనే మట్టి నింపి విత్తనాలు వేసే విధంగా సిద్ధం చేసి ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

మండల అభివృద్ధి అధికారులు విధిగా గ్రామ పంచయతిలను పర్యవేక్షించాలని, మండల స్థాయిలో సభలు సమావేశాలు నిర్వహించి గ్రామాల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పై సమీక్షా నిర్వహించి   లోటుపాట్లను సవరించాలని ఆదేశించారు.  మండల స్థాయి అధికారులు  సరియైన పర్యవేక్షణ లేకపోవడం వల్లనే నాగర్ కర్నూల్ జిల్లా అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఇతర జిల్లాలతో పోల్చుకుంటే వెనుకబడి పోతుందని తెలియజేసారు. ఇక నుండి అధికారులు తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ మను చౌదరి, పిడి డిఆర్ డి ఎ  నర్సింగ్ రావ్, గ్రామినాభివ్రుద్ధి శాఖ కేంద్ర పర్యవేక్షకులు రఘు కుమార్, అఖిల్, డి.పిఓ రాజేశ్వరి, జిల్లా భూగర్భ జల అధికారి రమాదేవి, జడ్పి సి.ఇ ఓ ఉషా, అందరు ఎంపిడిఓ లు, ఎపిఓ లు, ప్రోగ్రాం ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post