గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా జిల్లాలో ఈత చెట్లు నాటాలని, వృత్తి బతకాలంటే చెట్లు నాటాలని రాష్ట్ర పర్యాటక, క్రీడా, అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

పత్రికా ప్రకటన                                                       తేదీ:04-01-2022

గీతా కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా జిల్లాలో ఈత చెట్లు నాటాలని, వృత్తి బతకాలంటే చెట్లు నాటాలని రాష్ట్ర పర్యాటక, క్రీడా, అబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో నూతనంగా నిర్మించిన మద్య నిషేద మరియు ఆబ్కారీ శాఖ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వృత్తి బాగు చేయాలనే ఉద్దేశ్యం తో, వృత్తి పై గౌరవం తో చెట్లు నాటి కార్మికులకు ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ వృత్తి కి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశ్యం తో ముఖ్య మంత్రి గారు 3.75 కోట్ల చెట్లు నాటించడమే కాకుండా ప్రతి స్టేషన్ లో కుడా చెట్లు నాటించాలని తెలిపారు. ఈ వృత్తి ని బాగు చేయాలనే ఉద్దేశ్యం తో చనిపోయిన కార్మికులకు ఎక్స్ గ్రేషియా , పెన్షన్ లు  ఇస్తున్నామని, వృత్తి ని అభివృద్ధి ని పరచడానికి హైదరాబాద్ లో నీరా కేఫ్ ను ప్రారంభిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతుల అభివృద్ధి ధ్యేయంగా అడుగు వేయడం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా రైతుల కోసం  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ,అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరి అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం  రైతుల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న  ప్రభుత్వంమని,  ప్రపంచంలో ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నారు. రైతులకు ప్రత్యేక స్థానం కల్పించి, రైతులకు రైతు బంధు, రైతు భీమా ఇస్తుందని, రైతు బాగుంటేనే అన్ని వృత్తులు బాగుంటాయని , రజకులు, జాలర్లు, మిగతా అందరు వృత్తి కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.  జోగులాంబ గద్వాల్ జిల్లాకు  చాలా ప్రాముఖ్యత ఉందని, నడిగడ్డ ప్రాంతం అంటే ముఖ్యమంత్రి గారికి అపారమైన ప్రేమ ఉందని, జోన్లలో ఈ ప్రాంతానికి జోగులాంబ జోన్ గా  ప్రత్యేకమైన స్థానం కల్పించారని,  ఈ ప్రాంతం లో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ సురభివాణి దేవి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి , ఆలంపూర్ ఎమ్మెల్యే డా. వి.ఎం అబ్రహం, గద్వాల్ మున్సిపల్ చైర్ పర్సన్ బి.ఎస్. కేశవులు, మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరమ్మ, ఎక్సైజ్ జాయింట్ కమీషనర్ ఎస్.వై కురేషి, అసిస్టెంట్ కమీషనర్ దత్తు రాజ్ గౌడ్, జిల్లా మధ్యం నిషేధ అబ్కారి అధికారి సైదులు, సి.ఐ గోపాల్, ఆలంపూర్ సి.ఐ .పటేల్ బానోత్, ఎస్.ఐ లు, తదితరులు పాల్గొన్నారు.

——————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగుళాంబ గద్వాల జిల్లా గారి చె జారి చేయనైనది.

 

Share This Post