గురుకులాలు, వసతి గృహాల్లో త్రాగునీటి సరఫరా, టాయిలెట్ల వినియోగం పై ప్రత్యేక దృష్టి సారించాలి:-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

గురుకులాలు, వసతి గృహాల్లో త్రాగునీటి సరఫరా, టాయిలెట్ల వినియోగం పై ప్రత్యేక దృష్టి సారించాలి

– అన్నీ గురుకులాలు, హాస్టల్ లలోనే స్టాఫ్ ఉండాలి

– విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి .

-అన్ని ప్రభుత్వ హాస్టల్ లలో విద్యార్థులు దోమ కాటు కు గురికాకుండా మెస్ ఏర్పాటు

– మెనూ తప్పక తప్పనిసరిగా పాటించేలా చూడాలి

– గురుకులాలు, హాస్టల్ లలో ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది.

-జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

——————————

పారిశుద్ధ్య నిర్వహణ ఎట్లా ఉంది..
త్రాగునీటి సరఫరా వ్యవస్థ సరిగ్గా ఉందా?
మరుగు దొడ్లు ఉపయోగంలో ఉన్నాయా?
విద్యార్ధులు ఎవరైనా జ్వరం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు మీ దృష్టికి వచ్చిందా?
గురుకులాలు, వసతి గృహాల్లో స్టాక్ ఎలా ఉంది..
నాణ్యమైన, తాజా సరుకులు సరఫరా అవుతున్నాయా…
మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా అవుతుందా?
ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తున్నారా?

అంటూ… జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ప్రశ్నించారు.

బుధవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచీ జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాల తనిఖీ రిపోర్ట్, సమస్యల పరిష్కారం కు తీసుకోవాల్సిన చర్యలు, డ్రై డే నిర్వహణ పై మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివో లు, తహశీల్దార్ లు, వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ నెల 1, 2 తేదీల్లో జిల్లాలోనీ అన్ని ప్రభుత్వ గురుకులాలు, వసతి గృహాలను జిల్లా అధికారులైనా మండల ప్రత్యేక అధికారులు, ఎంపిడివో లు, తహశీల్దార్ లు,
హాస్టళ్లకు నియమించిన హాస్టల్ ప్రత్యేక అధికారులు తనిఖీ చేసిన విషయం తెలిసిందే.

అధికారులు అందజేసిన తనిఖీ రిపోర్ట్ పై , గురుకులాలు, హాస్టల్ లలో సమస్యలు, పరిష్కార ప్రగతి పై జిల్లా కలెక్టర్ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు.

గురుకులాలు, హాస్టల్ లలో అత్యవసరంగా పరిష్కరించాల్సిన సమస్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ప్రత్యేక అధికారులు తనిఖీ చేసి రిపోర్ట్ అందించినా … నిర్వహణ బాధ్యత వసతి గృహా సంక్షేమ అధికారుల దే నని జిల్లా కలెక్టర్ అన్నారు. సాధారణ పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
గురుకులాలు, హాస్టల్‌ లు, వాటి పరిసరాలు
హాస్టల్‌ వంట గది, స్టోర్‌ రూములు పరిశుభ్రంగా ఉండేలా చూడాలి. అన్ని టాయిలెట్ లకు నీటి సరఫరా అయ్యేలా, వినియోగంలో ఉండేలా చూడాలన్నారు.
వార్డెన్‌ ప్రతి రోజూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారా లేదా చూడాలన్నారు. దోమల వృద్ధి లేకుండా ఆయిల్ బాల్ లు వేయాలన్నారు. గ్రామ పంచాయితీ సహకారం లేకుంటే తనకు నివేదించాలని స్పష్టం చేశారు.

Rbsk వైద్యులు విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఏమైనా మేజర్ హెల్త్ సమస్యలుంటే ఏరియా, జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేయాలన్నారు.

అన్నీ గురుకులాలు,హాస్టల్ లలోనే స్టాఫ్ ఉండాలి

జిల్లాలోని అన్నీ గురుకులాలు, హాస్టల్ లలోనే స్టాఫ్ గురుకులాలు, హాస్టల్ లలోనే నివాసం ఉండాలన్నారు. వందశాతం స్టాఫ్ హాజరు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
ఆదేశాలు బేఖాతరు చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

వీటిని వెంటనే ఏర్పాటు చేయాలి

అన్ని ప్రభుత్వ హాస్టల్ భవనాలోని విద్యార్థులు దోమ కాటు కు గురికాకుండా మెస్ ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే ఆర్ ఓ ప్లాంట్, వాటర్ హీటర్ ఉండి నిరుపయోగం లో ఉంటే అవసరమైన మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. బాత్ రూం ల డోర్ లు లకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలన్నారు.
అన్ని గురుకులాలు మస్కిటో మెషిన్ లను సమకూర్చు కో వాలని సూచించారు. ప్రతి ఇన్స్టిట్యూషన్ కు మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా శానిటేషన్ ను ఇంప్రూవ్ చేయాలన్నారు.

శాఖ పరంగా నిధులు ఉంటే వెంటనే పనులు చేపట్టాలని అన్నారు. నిధులు లేక పోతే తనకు వచ్చే సోమవారం కల్లా ప్రపోజల్ సమర్పించి రెండు వారాల్లో పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంక్షేమ అధికారులను ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్, deo రాధా కిషన్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, ఎస్సీ, బిసి, ఎస్టీ గురుకులాల రీజనల్ కో ఆర్డినేటర్ లు, ఇంజనీరింగు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
——————————

*

Share This Post