గురుకుల పాఠశాలల్లో, వసతి గృహల్లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

 

గురుకుల పాఠశాలల్లో, వసతి గృహల్లోని విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టండి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0 0 0 0

     జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు,హస్టల్స్ మరియు గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రధానోపాధ్యాయులు రీజనల్ కోఆర్డినేటర్లను ఆదేశించారు.

     సోమవారం సాయంత్రం అదనపు కలక్టర్ చాంబర్ లో ప్రదానోపాద్యాయులు, రీజనల్ కో ఆర్డినేటర్లతో ఫుడ్ పాయిజనింగ్ నివారణ పై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యాలయాలు, వసతిగృహాలలో ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా సంబంధిత ప్రదానోపాద్యాయులు, రీజనల్ కో ఆర్డినేట్లర్లు ప్రటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా చూడడంతో పాటు నాణ్యమైన భోజనం అందించుటకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెలంగాణ మైనారిటి గురుకుల విద్యాలయాల సంస్థ (TMREIS) ఆద్వర్యంలో ఈనెల 27 నుండి మొదలుకొని 30 వరకు నాలుగు రోజుల ప్రత్యేక శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు. అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలో తెలంగాణ మైనారిటి రెసిడెన్సియల్ బాలుర పాఠశాలలో, విట్స్ కళాశాల, పెద్దపల్లి బైపాస్ రోడ్, కరీంనగర్ లో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు రోజుకో విభాగం చోప్పున 27 తేదీన కుక్ ( వంట చేసే వారికి )లకు 28న వార్డెన్లకు, 29 స్టాఫ్ నర్సులకు మరియు 30తేదీన ప్రదానోపాద్యాయుల కు శిక్షణ తరగతులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గంగారాం, వెనకబడిన తరగతుల అభివృద్ది అధికారి రాజమనోహార్ రావు, షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి నతానియెల్, జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి మధుసుదన్, ఉపాద్యాయులు, రీజనల్ కో ఆర్డినేటర్లు తదితరులు పాల్గోన్నారు.

Share This Post