గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారాన్ని అందించి.. భవిష్యత్లో ఉన్నత విద్యా రంగాలలో రాణించే విధంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రోనాల్ట్రాస్ అన్నారు.

ప్రచురణార్ధం

ఏప్రిల్ 22 ఖమ్మం:

గురుకుల విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారాన్ని అందించి.. భవిష్యత్లో ఉన్నత విద్యా రంగాలలో రాణించే విధంగా తీర్చి దిద్దాలని రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రోనాల్ట్రాస్ అన్నారు. శుక్రవారం నగరానికి వచ్చేసిన ఆయన నగరంలోని రఘునాథపాలెం, తనికెళ్ల దానవాయిగూడెం గురుకులాలను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి సందర్శించారు. మొట్టమొదటగా రఘునాథపాలెం గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాన్ని అనంతరం కొణిజర్ల మండలం తనికెళ్ల లో మహిళా డిగ్రీ కళాశాలను వారు సందర్శించి విద్యార్థినీలతో ముఖాముఖి మాట్లాడ్ వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తణికెళ్ల మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్ధినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసారు. అనంతరం దానవాయి గూడెం సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకులాన్ని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ, జిల్లా కలెక్టర్, ఐ.టి.డి.ఏ. పి.ఓ, నగరపాలక సంస్థ కమీషనర్ తో కలిసి పరిశీలించారు. తణికెళ్ల మహిళా డిగ్రీ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ల్యాచ్లను, వంట గదులను ఆయన పరిశీలించారు. విద్యార్థినులతో ముచ్చటించిన రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్కు కళాశాల విద్యార్థినులు తాము పొందుతున్న నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు, పౌషికాహారం సంతృప్తికంగా ఉనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులకు ఉన్నత విద్య పట్ల హితబోధ చేస్తూ భవిష్యత్లో ఉన్నత విద్యను అభ్యసించి అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో గురుకుల విద్యాలయాలలో గల విద్యార్థుల సంఖ్య, వారికి అందిస్తున్న విద్యా, వసతి, భోజన ఏర్పాట్లను, ఉన్నత విద్య పట్ల ఇప్పటి నుండే విద్యార్థినులకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాల గురించి రాష్ట్ర గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి రొనాల్డస్కు వివరించారు.

జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కృష్ణ నాయక్, ఏ.టి.డి.ఓ. ఎస్. తిరుమలరావు, మైనింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంజయ్ కుమార్, రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్ మానస, ప్రజా ఐశ్వర్యా రాణి, అధ్యాపకులు విద్యార్ధినులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post