ఈ క్యాంపు నిర్వహణలో జిల్లాలోని అన్ని సంక్షేమ శాఖల అధికారులు స్టాల్స్ ఏర్పాటు చేయాలనీ అన్నారు. ఈ స్టాల్స్లో వారు పేదలకు, మహిళలకు, పిల్లలకు, అంగవైకల్యం ఉన్న వారికీ, కార్మికులకు చేసే కార్యక్రమాలు తెలిపే విదంగా బోర్డులు ప్రదర్శించాలని, వారు అందించే పధకాల పై అవగాహనా కల్పించడానికి గైడ్స్ ను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని లబ్దిదారులను గుర్తించి వారికీ ఆ రోజున అందజేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారి అక్కేశ్వర్ రావు మరియు ఇతర సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
