గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కారేపల్లి మండలంలో పర్యటించి అంగన్వాడి కేంద్రం, పాఠశాలల తనిఖీ, హరితహారం క్రింద మొక్కలు నాటడం చేశారు.

ప్రచురణార్థం

ఖమ్మం, జూలై 28:

గురువారం ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ కారేపల్లి మండలంలో పర్యటించి అంగన్వాడి కేంద్రం, పాఠశాలల తనిఖీ, హరితహారం క్రింద మొక్కలు నాటడం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కారేపల్లి అంగన్వాడి-1 కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లల హాజరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టోర్స్ లో గ్రుడ్లు, బాలామృతం, సరుకుల తనిఖీ చేశారు. ప్యాక్ లను పరీక్షించి, తయారి, గడువు తేదీలను పరిశీలించారు. కేంద్రంలో చేపట్టిన విద్యుత్ పనులు, ఫ్యాన్లను పరిశీలించారు. మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను తనిఖీ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమం క్రింద చేపడుతున్న విద్యుత్, టాయిలెట్ల మరమ్మత్తులు, ప్రహారీ గోడ పనుల పురోగతిని పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పిల్లల హాజరు గురించి అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన వంటకు షెడ్డు ఏర్పాటుచేయాలని ఆయన అన్నారు. అనంతరం తులస్య తాండ వద్ద కారేపల్లి పెద్ద చెరువును కలెక్టర్ పరిశీలించారు. చెరువు విషయంలో కారేపల్లి, అప్పాయిగూడెం గ్రామ ప్రజల వివాదాన్ని అడిగి తెలుసుకున్నారు. చెరువు పరిధి, అలుగు, చుట్టుప్రక్క ప్రాంతాలను ట్యాబ్ ద్వారా గూగుల్ మ్యాప్ లో పరిశీలించారు. సమగ్ర సర్వే చేసి, సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం పేరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరును అడిగి తెలుసుకున్నారు. ఆంగ్ల మాధ్యమం బోధించుచున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహణ కమిటి ఆంగ్ల మాధ్యమంలో బోధన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆవరణలోనే వున్న ప్రాధమిక పాఠశాలను తనిఖీ చేశారు. జిల్లాలోని పాఠశాలల్లో మిగులు డ్యూయల్ డెస్కుల లెక్క తీసి, అవసరమున్న చోటుకు సర్దుబాటుచేయాలన్నారు. పాఠశాలల్లో పరిశుభ్రతను పాటించాలని ఆయన తెలిపారు. స్లాబులపై నీరు నిల్వడంతో, కురవడం, త్వరగా దెబ్బతినడం జరుగుతుందని, నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం మాదారం గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

కలెక్టర్ పర్యటన సందర్భంలో డిఆర్డివో విద్యా చందన, డిఇఓ యాదయ్య, డిపివో హరిప్రసాద్, మైన్స్ జిఎం శివ కుమార్, కారేపల్లి మండల ఎంపిపి శకుంతల, ఎంపిడివో చంద్రశేఖర్, తహసిల్దార్ రవి కుమార్, ఎంఇవో జయరాజ్, ఎంపివో రాజారావు, ఆర్ డబ్ల్యుఎస్ ఏఇ నరేందర్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు వున్నారు.

Share This Post