గురువారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రాజపేట మండలం లో పర్యటించారు. సోమారం గ్రామంలో హ్యాండ్ ఆఫ్ హోప్ స్వచ్ఛంద సంస్థ వారి హెల్త్ క్యాంపును సందర్శించారు. అనంతరం సోమారం గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.

గురువారం నాడు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి రాజపేట మండలం లో పర్యటించారు.
సోమారం గ్రామంలో హ్యాండ్ ఆఫ్ హోప్ స్వచ్ఛంద సంస్థ వారి హెల్త్ క్యాంపును సందర్శించారు.
అనంతరం  సోమారం గ్రామ పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు.
తదుపరి రేణిగుంట గ్రామంలో  వడ్ల కొనుగోలు కేంద్రాన్ని, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, తడి చెత్త పొడి చెత్త వేరు చేసే కేంద్రాలను పరిశీలించారు.
అనంతరం రాజాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరు,  వసతులను పరిశీలించారు.  కోవిద్ టీకా నిల్వల గురించి తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న యునాని హాస్పిటల్ డాక్టర్ పోస్ట్ గురించి విచారించారు.
నెమిల గ్రామ పరిధిలో గల సందీప్, పులి భూపాల్ రైతుల వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్న బ్లాక్ రైస్,  ఇతర వంగడాల పరిశీలించారు. ఆధునిక పద్ధతిలో వారు చేపట్టిన వ్యవసాయ సాగును అభినందించారు.
కార్యక్రమాలలో మండల అభివృద్ధి అధికారి రామరాజు, వ్యవసాయ అధికారి మాధవి, సోమవారం సర్పంచ్ కిషన్, ఉపసర్పంచ్ జంపయ్య, రేణిగుంట సర్పంచ్ భాగ్యమ్మ,  రాజపేట పి హెచ్ సి డాక్టర్ శివవర్మ,  గ్రామ పంచాయతీల సెక్రటరీలు పాల్గొన్నారు.

Share This Post