గురువారం నాడు పరకాల, మండలంలోని నాగారం, లక్ష్మపురం, గ్రామ పంచాయితీలలో నర్సరీ, పల్లే ప్రకృతి వనాలు, బృహత్ పల్లే ప్రకృతి వనాల లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అకస్మిక తనిఖీ చేశారు

గురువారం నాడు పరకాల, మండలంలోని నాగారం, లక్ష్మపురం, గ్రామ పంచాయితీలలో నర్సరీ, పల్లే ప్రకృతి వనాలు, బృహత్ పల్లే ప్రకృతి వనాల లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అకస్మిక తనిఖీ చేశారు

*ప్రెస్ నోట్*

*హనుమకొండ*

*పరకాల*

*మే 12*

గురువారం నాడు పరకాల, మండలంలోని నాగారం, లక్ష్మపురం, గ్రామ పంచాయితీలలో నర్సరీ, పల్లే ప్రకృతి వనాలు, బృహత్ పల్లే ప్రకృతి వనాల లను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అకస్మిక తనిఖీ చేశారు.

ఈ సందర్భగా అయన మాట్లాడుతూ నర్సరీలలో డిమాండ్ కు ఆనుగునంగా మొక్కలు నాటాలని వచ్చే హరిత హారం కార్యక్రమం వరకు అన్ని మొక్కలు సిద్దంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొక్కలు కాకుండా వృక్షాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపడుతున్న అభివృద్ధి పనుల కూలీల సంఖ్య పెంచి మస్టర్ నమోదు చేయాలన్నారు. పక్కాగా వంద శాతం పని దినలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వారికి ఎండ కాలంలో కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు.నీడలోనే ఎక్కువ పని గంటలు కల్పించాలని అన్నారు.

పల్లె ప్రకృతి వనాలు, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ప్రతి మండలానికి ఐదు బృహత్ పల్లే ప్రకృతి వనాలు,

మెగా ప్రకృతి వనాలు ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ ఏ. శ్రీనివాస్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.   

Share This Post