పత్రికా ప్రకటన
కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఫలితాలు:రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన మంత్రి
నల్గొండ,సెప్టెంబర్ 11.కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు మంచి ఫలితాలు సాధిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి అన్నారు.శనివారం నల్గొండ పట్టణం లో చిన వెంకట రెడ్డి పంక్షన్ హాల్ లో గురు పూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమం లో మంత్రి ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ సందర్భముగా మంత్రి మాట్లాడుతూ పది,ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల ల్లో కార్పొరేట్ కు దీటుగా ఉత్తీర్ణత సాధిస్తూ మంచి ర్యాంకు లు సాధిస్తున్నారని అన్నారు.ప్రైవేట్ పాఠశాలల్లో,ఆసుపత్రులకు వెళ్లడం డబ్బులు ఖర్చు పెట్టుకోవడమే నని, ప్రభుత్వ పాఠశాలలు,ఆస్పత్రుల్లో వసతులు కల్పన కు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని,రాష్ట్ర ముఖ్యమంత్రి విద్య,వైద్య రంగం పై ప్రత్యేక దృష్టి పెట్టారని అన్నారు.జిల్లాకో మెడికల్ కాలేజి తో వైద్య రంగం లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్న ట్లు తెలిపారు. అన్నారు.ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి నేను రాను బిడ్డో అని పాటలు రాశారని,ప్రస్తుత కరోనా పరిస్థితులలో వైద్య శాఖ ద్వారా డాక్టర్ లు,సిబ్బంది మంచి సేవలు అందించారని,ప్రభుత్వ ఆసుపత్రులలో చిన్న జ్వరం నుండి క్యాన్సర్ వరకు వైద్య సేవలు లభిస్తున్నాయని,ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం పెరిగిందని అన్నారు.కరోనా సమయం లో ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపుతున్నారని,కరోనా వున్నా లేకున్నా మంచి బోధన, చదువు తో పిల్లలను చేర్పించేలా ఉపాధ్యాయులు బోధించాలని అన్నారు.ప్రభుత్వ పాటశాలల్లో సీట్లకు పైరవీ లు చేసే పరిస్థితి రావాలని అన్నారు. ఉపాధ్యాయులు అంకిత భావం తో పని చేసి విద్య రంగం లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలుపాలని కోరారు. అంకిత భావం,ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయులను ప్రోత్సహించడం మన బాధ్యత అన్నారు.ఉత్తమ ఉపాద్యాయులను ఈ సందర్భంగా మంత్రి అభినందనలు తెలిపారు. ఈ సందర్భముగా ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎంపికైన 109 మంది ఉపాధ్యాయులకు అవార్డులు, శాలువా తో మంత్రి సత్కరించారు.ఉపాధ్యాయ ఎం.ఎల్.సి.అలుగు బెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి నాణ్యమైన విద్య ను అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్,నోముల భగత్,ఎన్. భాస్కర్ రావు,మున్సిపల్ చైర్మన్ సైది రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్,డి.ఈ. ఓ.భిక్షపతి తదితరులు పాల్గొన్నారు
—————————-
సహాయ సంచాలకులు,సమాచార శాఖ ,నల్గొండ చే జారీ చేయనైనది.