గూడూరు వైద్యశాలకు గుర్తింపు తేవాలి…

ప్రచురణార్థం

గూడూరు వైద్యశాలకు గుర్తింపు తేవాలి…

మహబూబాబాద్ నవంబర్ 11.

గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు గుర్తింపు తెచ్చే విధంగా ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ గూడూరు మండలం లో పర్యటించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు.

ప్రసూతి విభాగం, ఆయుష్ క్లినిక్, డెంటల్ క్లినిక్, ఓపి విభాగాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ప్రజలతో వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకులు భూక్య వెంకట రాములు ఆధ్వర్యంలో వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక వైద్య సామాగ్రి అందుబాటులో ఉన్న ప్రజలకు అందకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మెరుగు పడకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. వైద్యశాలకు తగినట్లుగా పనితీరు తప్పనిసరిగా ఉండాలన్నారు.
కాన్పుల ప్రగతి పెరగాలన్నారు.

అదేవిధంగా పైల్స్ హైడ్రోసిల్ హెర్నియా వంటి చిన్న ఆపరేషన్ లు స్థానికంగా జరగాలన్నారు.
వైద్య సేవలు పెరిగితేనే గుర్తింపు లభిస్తుందని తద్వారా ఓ పి పెరుగుతుందన్నారు. కోవిద్ ఉన్న నిబంధనలు పాటిస్తూ వైద్య సేవలు అందజేయాలన్నారు.

ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలని వారానికి రెండు సార్లు పారిశుధ్యం మెరుగు పరచాలని రిజిస్టర్లో నమోదు చేయించాలని మండల ప్రత్యేక అధికారి కి సూచించారు.

ఆసుపత్రి కాంపౌండ్ వాల్, విద్యుత్ సమస్యలు సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని తాసిల్దారు ను ఆదేశించారు.

హాస్పిటల్ ఆవరణ ను సందర్శించి పరిశీలించారు చెత్తాచెదారం తొలగించాలని ఫోటోలను అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో కలెక్టర్ సందర్శించారు. ప్రజలు అందించిన పలు విజ్ఞప్తులను స్వీకరించారు.

కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి చత్రు నాయక్, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకులు భూక్య వెంకట రాములు, తాసిల్దార్ శైలజ, గూడూరు హాస్పిటల్ పర్యవేక్షకులు వీరన్న, డాక్టర్లు రాజు కటయ్య భరత్ రెడ్డి శివ శంకర్ అరవింద్ కుమార్ శశిధర్ రెడ్డి ప్రావీణ్య సంతోష్ కుమార్ రమేష్ హెడ్ నర్సులు మిరియం ఉమా మహేశ్వరి ఉప సర్పంచ్ సంపత్ శివరాత్రి ఎం పి టి సి 1 కత్తి స్వామి తదితరులు పాల్గొన్నారు.
————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post