గృహ ప్రవేశాలకు సిద్ధం…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

గృహ ప్రవేశాలకు సిద్ధం…. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు గృహ ప్రవేశాలకు సిద్ధమైనట్లు జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

శుక్రవారం ఆయన జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి తో కలిసి అందోల్, కంకోల్ ,మునిపల్లి, డాకూర్ లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం పేదలకు గొప్ప వరం అన్నారు. జిల్లాలో సిద్ధంగా ఉన్న ఇండ్లలోకి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా కారణంగా కొంతమేర జాప్యం జరిగిందన్నారు.

అందోల్ లో 21 బ్లాకులు అన్ని వసతులతో ప్రారంభానికి సిద్ధం అయ్యాయన్నారు. లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తయిందని ఒకటి రెండు రోజుల్లో ఇళ్ల కేటాయింపు కూడా పూర్తి చేసి, వచ్చేవారం లో మంత్రి గారి చే ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

కార్తీక మాసం అయినందున లబ్ధిదారులకు గృహప్రవేశాలకు అనుకూలంగా ఉందన్నారు. అద్దె గదుల్లో నివసించే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లతో వారి జీవితానికి భరోసా లభిస్తుందన్నారు.

అందోల్ వడ్డెర కాలనీలో 198 ఇండ్లు, నగర పంచాయతీ లో 216, ఢాకూర్ లో 104, మునిపల్లి లో 72, కంకోల్ లో 96 ఇండ్లు ప్రారంభానికి సిద్ధమైనట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని మౌలిక వసతులను ఏర్పాటు చేశామని, పై ఫ్లోర్ లో కూడా భగీరథ తాగునీరు వస్తుందన్నారు. అన్ని ఇళ్లకు ఎలక్ట్రిసిటీ మీటర్లను కూడా బిగించినట్లు తెలిపారు.

కంకోల్, మునిపల్లి, ఢాకూర్ లలో నిర్మించిన ఇండ్లలో లబ్ధిదారులు ఏకకాలంలో గృహప్రవేశాలు చేసేలా అన్ని చర్చలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

జిల్లాలో సిద్ధంగా ఉన్న అన్ని డబుల్ బెడ్రూం ఇండ్ల లో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

కలెక్టర్ వెంట జెడ్పి చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, డి పి ఓ సురేష్ మోహన్, డిఆర్డిఓ శ్రీనివాస్ రావు, డి ఎఫ్ ఓ వెంకటేశ్వర్లు,
డి సి ఓ ప్రసాద్, మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్, రెవిన్యూ డివిజనల్ అధికారి అంబదాస్, పంచాయతీరాజ్ ఈఈ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు ,తదితరులు పాల్గొన్నారు.

Share This Post