గృహ హింస నుండి ఉపశమనం ,రక్షణ కల్పించే విధంగా మహిళలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

 పత్రిక ప్రకటన                                             తేది:04-08-2021

గృహ హింస నుండి  ఉపశమనం ,రక్షణ కల్పించే విధంగా మహిళలకు  అవగాహన కల్పించాలని  జిల్లా కలెక్టర్ శృతి ఓజా అన్నారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలు నందు మహిళా, శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ ఇంట్లో ఉండే స్త్రీ , పురుష సంబంధాలలో అసమానతలు  ఏర్పడి గృహ హింస కు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. గృహ హింస , పని చేసె చోట వేధింపులు, లైంగిక వేధింపులు, వరకట్నపు వేధింపులు, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణా నివారణ కోసం మహిళా హెల్ప్ లైన్ నెంబర్ 181 కు కాల్ చేయాలనీ , హింస కు గురి అయిన బాలికలకు, మహిళలకు   సఖి సెంటర్ నుండి సహాయం అందించబడుతుందని అన్నారు. సమస్యాత్మకంగా ఉన్న కేసులు కోర్టు ద్వారా  నోటీసులు పంపించి వాటిని పరిష్కరించే విధంగా  చర్యలు తీసుకోవాలని అన్నారు.  మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి తమ కేసులు రిజిస్టర్ చేసుకునే విధంగా వారికి గృహ హింస చట్టం పై అవగాహన కల్పించాలని  అన్నారు. కౌన్సిలింగ్, శిక్షణ కార్యక్రమాలు, సేమినార్స్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశించారు. గ్రామ స్థాయి లో ప్రజలకు పోస్టర్స్, పెయింటింగ్ ద్వారా అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని  డి.పి.ఓ. కు ఆదేశించారు. సఖి కేంద్రం ద్వారా  మెరుగైన సేవలు అందించడం కోసం లైన్ డిపార్ట్మెంట్స్ అందరు సహకారం అందించాలని కోరారు.

జిల్లా ఎస్పి రంజన్ రతన్ కుమార్ మాట్లాడుతూ సఖి కేంద్రం వారి సేవలు అభినందనీయమని, మా నుండి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని తెలిపారు. పోక్సో కేసులు కోర్టు ద్వారా సత్వరం పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశించారు.

 ఇప్పటివరకు సఖి కేంద్రానికి వచ్చిన కేసుల వివరాలు మరియు సఖి కేంద్రం వారు చేసిన కార్యక్రమాలు సఖి సెంటర్ నిర్వాహకురాలు జయలక్ష్మి  పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

సమావేశం లో శిశు సంక్షేమ శాఖ అధికారిణి  ముశాయిధ బేగం, డి.పి.ఓ. శ్యాం సుందర్,  గోవర్ధిని, శ్రీధర్ అడ్వకేట్ , జయలక్ష్మి , సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.

———————————————————————   

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల ద్వారా  జారీ చేయడమైనది.

Share This Post