గెలుపోటములు సహజం స్పోర్టివ్ గా తీసుకుంటూ రాణించాలి…..జిల్లా కలెక్టర్ కె.శశాంక.

గెలుపోటములు సహజం స్పోర్టివ్ గా తీసుకుంటూ రాణించాలి…..జిల్లా కలెక్టర్ కె.శశాంక.

ప్రచురణార్థం

మహబూబాబాద్, ఆగస్ట్ -18:

ఆటల్లో, నిత్యజీవితంలో గెలుపోటములు సహజమని, వాటిని స్పోర్టివ్ గా తీసుకుంటూ ప్రయత్నంలో లోపం లేకుండా రాణించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా
గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఉద్యోగుల క్రీడల ఫైనల్ మ్యాచ్ లకు జిల్లా కలెక్టర్ కె.శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ లు విచ్చేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి మ్యాచ్ ను ప్రారంభించారు. మ్యాచ్ లను వీక్షించి, కాసేపు క్రీడాకారులతో కలిసి వాలీబాల్ ఆడారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, క్రీడలను జీవితంలో భాగం చేసుకోవాలని, మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా, ధైర్యశాలిగా ఒక క్రీడాకారులు మాత్రమే ఉంటారని, క్రీడలు ఎంతో ఉల్లాసాన్ని ఇస్థాయిని, పార్టిసిపేషన్ ముఖ్యం కానీ ప్రైజులు కాదని, గెలుపోటములు సహజమని అన్నారు.

క్రీడా పోటీల్లో భాగంగా కబడ్డీ, వాలీబాల్ ,టగ్ ఆఫ్ వార్ నిర్వహించగా కబడ్డీ లో ఎడ్యుకేషన్, పోలీస్ టీములు తలపడగా ఎడ్యుకేషన్ ప్రథమ స్థానంలో, వాలీబాల్లో పంచాయతీ రాజ్ ఎడ్యుకేషన్ పోటీపడగా ఎడ్యుకేషన్ ప్రధమ స్థానంలో నిలిచింది. టగ్ ఆఫ్ వార్ లో ఉమెన్స్ పోలీస్ టీమ్స్, మెన్స్ విభాగంలో ఎడ్యుకేషన్ లు వెలుపొందాయి,

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్ , ఎం డేవిడ్, ఏ ఎస్పి యోగేష్ గౌతమ్, జడ్పీ సీఈవో రమాదేవి, డి ఆర్ డి ఓ సన్యాసయ్య, డి వై ఎస్ ఓ అనిల్ , జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, వ్యాయామ ఉపాధ్యాయులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post