గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

 

గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ

జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ

ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

పూలమాలలు వేసి నివాళులర్పించిన జడ్పి చైర్మన్ కలెక్టర్, మేయర్

0000

వీరనారి చాకలి ఐలమ్మ గొప్ప పోరాట యోధురాలు అని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ అన్నారు.

     వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని కలెక్టరేట్ ప్రతిమ మల్టీప్లెక్స్ రోడ్డు కూడలి వద్ద గల వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు లతో కలసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ పౌరుషాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని భావి తరాలకు అందించి ఉద్యమ స్ఫూర్తిని రగిల్చిన గొప్ప పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ అని కొనియాడారు.

     ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్, నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్ డిప్యూటీ కమిషనర్ త్రియంబకేశ్వర్ రావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజ మనోహర్ రావు, తహసిల్దార్ సుధాకర్, జయంతి ఉత్సవ రాష్ట్ర అధ్యక్షుడు పూసాల సంపత్, కార్పొరేటర్ జి సాగర్, కార్పొరేటర్లు, రజక సంఘ నాయకులు శ్రీకాంత్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post