గొర్రెలు, మేకలకు నట్టల మందును తప్పకుండా వేయాలి — జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్

సరైన సమయంలో నట్టల నివారణ మందులు గొర్రెలకు, మేకలకు వేసి పశు సంపదను కాపాడాలని జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ తెలిపారు.
బుధవారం తెల్కపల్లి మండలంలోని జమిస్తాపూర్ గ్రామంలో జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నట్టల నివారణ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ పాల్గొని గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును వేసి ప్రారంభించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేటి నుంచి 14వ వరకు జిల్లాలో ఉచిత నట్టల నివారణ మందులు పశుసంవర్ధక శాఖ ద్వారా గొర్రెలకు, మేకలకు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
జీవాలలో సరైన సమయంలో నట్టల మందు తాగించడం వల్ల నట్టల బెడద తగ్గిపోయి బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, చిన్నపిల్లల్లో మరణాల శాతం తగ్గుతుందని, పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, గొర్రెలు, మేకల పెంపకం దారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులను తాగించి వాటిని సంరక్షించుకోవాలని  కలెక్టర్ సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా 10 లక్షల గొర్రెలు 2 లక్షల మేకలు ఉన్నాయని వాటి పెంపకం దారులు తప్పనిసరిగా నట్టల మందులు వేయించాలన్నారు.
47 టీమ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
గొర్రెల యజమాని జిల్లా కలెక్టర్ కు గొంగలి, తల రుమాలను దరింప జేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ పి.వి. రమేష్, మండల ప్రత్యేక అధికారి మోహన్ బాబు, జిల్లా సహాయ పశువైద్యాధికారి జ్ఞానేశ్వర్, ఎంపీపీ కొమ్మ మధు, మండల పశువైద్యాధికారి డాక్టర్ యం. నాగరాజ్ యాదవ్,  గ్రామ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, జేవిఓలు సత్య, ఆరిఫ్, అస్లాం, శ్యామ్ మండల ఎంపీడీవో, తహసిల్దార్, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post