గొర్రెలు, మేకలకు నట్టల మందును తప్పకుండా వేయాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ప్రచురణార్థం

గొర్రెలు, మేకలకు నట్టల మందును తప్పకుండా వేయాలి — జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

కేసముద్రం (మహబూబాబాద్ జిల్లా) ఆగస్ట్-10 :

సరైన సమయంలో నట్టల నివారణ మందులు గొర్రెలకు, మేకలకు వేసి పశు సంపదను కాపాడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం ఉదయం కేసముద్రం మండలం తాళ్ల పూస పల్లి గ్రామంలో జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నట్టల నివారణ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొని గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందును వేశారు.  

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఈనెల 13వ వరకు జిల్లాలో ఉచిత నట్టల నివారణ మందులు పశుసంవర్ధక శాఖ ద్వారా గొర్రెలకు, మేకలకు వేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జీవాలలో సరైన సమయంలో నట్టల మందు తాగించడం వల్ల నట్టల బెడద తగ్గిపోయి బరువు పెరిగి ఆరోగ్యంగా ఉంటాయని, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, చిన్నపిల్లల్లో మరణాల శాతం తగ్గుతుందని, పునరుత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని, గొర్రెలు, మేకల పెంపకం దారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులను తాగించి వాటిని సంరక్షించుకోవాలని  కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి టి. సుధాకర్, మండల పశువైద్యాధికారి బి.విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ నవీన్ రెడ్డి,  గ్రామ సర్పంచ్ విజిత, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

————————————————————————————————————————
జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post