గొర్రెల అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన గొర్రెల యూనిట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ .

పత్రిక ప్రకటన                                                                      తేది:01-12-2021

గొర్రెల అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం ఇచ్చిన గొర్రెల యూనిట్లను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ .

బుధవారం  జిల్లా లోని గట్టు మండలం , ఆరగిద్ద గ్రామం లో గొర్రెల అభివృద్ధి పథకం కింద ఇచ్చిన గొర్రెల యూనిట్లను పరిశీలించి మాట్లాడుతు నిబంధనల ప్రకారము గొర్రెలకు వేసిన ట్యాగ్లను పరిశీలించారు. కొంత మంది లబ్దిదారులు గొర్రెల చెవికి పుండు అవుతున్నదని ట్యాగ్ తీసివేయడం గమనించారు.

గొర్రెల చెవికి ట్యాగ్ లేనట్లయితే భవిష్యత్తు లో ప్రమాదవశాత్తు గొర్రె చని పోతే ఇన్సూరెన్స్ వర్తించదని, లబ్దిదారులకు సూచించారు. ప్రభుత్వము ఇచ్చిన గొర్రెలకు సరయిన పోషణ అందింఛి లబ్ది పొందాలని సూచించారు.

కార్యక్రమం లో పశు వైద్య శాఖ అధికారి డా.వెంకటేశ్వర్లు, డా.శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చె జారి చేయబడినది.

Share This Post