గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ

సిద్దిపేట 2 జూన్ 2022.

వరిధాన్యాన్ని తీసుకోని రైస్ మిల్లు లను బ్లాక్ లిస్టులో పెడతామని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. గురువారం అదనపు కలెక్టర్ సిద్దిపేట రూరల్ మండలాలలోని ఇర్కోడ్ లోని ఎంఎం ఫుడ్స్, రాధాకృష్ణ పీబి రైస్ ఇండస్ట్రీ, మిర్ దొడ్డి కసులాబాద్ లోని లలితా పరమేశ్వరి మిల్, వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్, సిద్దిపేట అర్బన్ మండలం లోని మిట్టపల్లి గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులు పండించిన చివరి వరిధాన్యం గింజను కూడా ప్రభుత్వం ఉంటుందని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు పంపించే వరి ధాన్యాన్ని తప్పకుండా రైస్ మిల్లు తీసుకోవాలని లేనిచో రైస్ మిల్ లను బ్లాక్ లో పెట్టి వచ్చే సీజన్లో ధాన్యాన్ని కేటాయించమని హెచ్చరించారు. రా మరియు బాయిల్డ్ రైస్ మిల్ లలో దాన్ని దింపుకోడానికి స్థలం సరిపోకపోతే ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ గోడౌన్ లను కేటాయిస్తామని వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. అనంతరం దుబ్బాక మండలంలోని హబ్సీపూర్ లో పోలీస్ అధికారులతో కలిసి రహదారిపై వెళ్లే ఖాళీ లారీలను ఆపి వరి ధాన్యాన్ని మిల్లులకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం సిద్దిపేట వారిచే జారీ చేయడమైనది.

Share This Post