గోదావరిఖని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్


డిసెంబర్ చివరి వరకు ఆసుపత్రి నిర్మాణం పూర్తి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
సకాలంలో వైద్యులు విధులకు హాజరు కావాలి
పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలి
మెడికల్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
గోదావరిఖని ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి నవంబర్ 20
:- డిసెంబర్ చివరి వరకు గోదావరిఖని ఏరియా ఆసుపత్రి అదనపు బెడ్ ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత ఇంజనీర్లను గుత్తేదారులు ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ మెడికల్ కళాశాల నిర్మాణం పనులు, ఆస్పత్రి అదనపు బెడ్ నిర్మాణ పనులను పరిశీలించి గోదావరిఖని ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. రామగుండం ప్రాంతంలో ప్రభుత్వ నూతన మెడికల్ కాలేజీని మంజూరు చేసిందని, వచ్చే సంవత్సరం తరగతుల ప్రారంభానికి సిద్ధం చేసే విధంగా నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మెడికల్ కాలేజ్ అనుబంధ ఆసుపత్రి కోసం గోదావరిఖని ఏరియా ఆసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్న అదనపు 85 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు డిసెంబర్ చివరి వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి నిర్మాణం పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, అవసరమైతే రాత్రివేళల్లో సైతం లైట్ల వెలుతురులో పని జరిగేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభించి ప్రణాళికా బద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మెడికల్ కళాశాల నిర్మాణం పనులు సోమవారం నుంచి ప్రారంభిస్తామని కాంట్రాక్టర్లు కలెక్టర్ కు తెలిపారు. అనంతరం గోదావరిఖని ఏరియా ఆస్పత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు
వైద్యుల సకాలంలో విధులకు హాజరుకావాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్యసేవలు అందించాలని, ఆసుపత్రికి వచ్చే పేదలతో ప్రవర్తన సఖ్యతగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు.

డి.సి.హేచ్ ఎస్ .డాక్టర్ మందల వాసుదేవ రెడ్డి,సూపరెండేంట్ శ్రీనివాస్ రెడ్డి, పాల్గొన్నారు.

Share This Post