గోపాల్ పేట, తాడిపత్రి, బుద్ధారం, పగిడిగడ్డ తాండలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల తనిఖీ, కోవిడ్ వ్యాక్సినేషన్ పై అవగాహన : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.   తేది:6.12.2021, వనపర్తి

యాసంగిలో వరి పంటకు ప్రత్యామ్నాయంగా పది రకాలైన ఆరుతడి పంటలు సాగు చేసుకునేలా రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా పరిధిలోని గోపాల్ పేట, తాడిపత్రి, బుద్ధారం, పగిడిగడ్డ తాండలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె పరిశీలించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాలలో, వార్డులలో వ్యాక్సినేషన్ పై స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన కల్పించి మొదటి, రెండవ డోసులు వ్యాక్సినేషన్ డిసెంబర్ 31 వ. తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.  వనపర్తి పట్టణంలోని 3వ వార్డులోని ఇంటిని ఆమె సందర్శించి వ్యాక్సిన్ పై జిల్లా కలెక్టర్ అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోసు తీసుకొనివారు 45 వేల మంది ఉన్నట్లుగా, అదేవిధంగా రెండవ డోసు వ్యాక్సిన్ తీసుకొనుటకు 1 లక్ష 60 వేల మంది అర్హులుగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. డిసెంబర్ 31వ తేదీలోగా రెండు లక్షల డోసులు లక్ష్యంగా నిర్ధారించుకున్న ట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. అన్ని గ్రామాలలో, మున్సిపాలిటీ వార్డులలో సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, ప్రజా ప్రతినిధులు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి 100 శాతము వ్యాక్సినేషన్ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
బుద్ధారం, గోపాల్పేట గ్రామపంచాయతీలలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు 17 శాతం లోపు తేమ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఆమె అన్నారు. జిల్లాలో 130 కొనుగోలు కేంద్రాల ద్వారా 60 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. యాసంగిలో వరి ధాన్యాన్ని ఎఫ్సిఐ (FCI) కొనుగోలు చేయనందున రైతులు వరి సాగు చేసి ఇబ్బందులు పడవద్దని ఆమె సూచించారు. ఆయిల్ ఫామ్, కుసుమ, వేరుశనగ, ప్రత్తి, మినుము, పెసర ,శనగ, ఆముదం, కూరగాయలు తదితర 10 రకాల పంటలు సాగు చేసుకుని అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ అన్నారు. మార్కెట్ యార్డ్ కు వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు డాటా ఎంట్రీ చేయాలని, ధాన్యంలో తేమ ఉండేలా చూడాలని ఆమె తెలిపారు. రైతులకు అన్ని విధాలుగా లాభం చేకూరేలా అవగాహన చర్యలు చేపట్టి ఆరుతడి పంటలు పండించుటకు మండల వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. ఆయిల్ ఫామ్ తోటలను పెంచినట్లయితే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, కడుకుంట్లలోని నర్సరీలో రెండు లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతూ జిల్లాలో నేటి నుండి కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతున్నదని మొదటి డోర్ వేసుకొని వారు ఉంటే తక్షణం వేయించుకోవాలని,  రెండవ డోస్ 1 లక్షా 60 వేల మంది అర్హులని ఆమె తెలిపారు. ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించి 18 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో జడ్పిటిసి, ఎంపిపి, ఎంపీటీసీ, సర్పంచ్, వైద్యశాఖ, ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించి వందశాతం మొదటి, రెండవ డోసు వేసుకునేలా శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈనెల 8వ తేదీ నుండి రెండవ డోసు తీసుకునే వారికి స్పెషల్ డ్రైవ్ ఉంటుందని, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయుటకు అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
గోపాల్పేట మండలంలోని పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. బుద్ధారం గ్రామ పంచాయతీలోని గ్రామ సచివాలయంని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి అనిల్ కుమార్, వైద్య అధికారులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ లు, బుద్ధారం సర్పంచ్ పద్మమ్మ, ఉప సర్పంచ్ కావలి నాగరాజు, గోపాల్ పేట సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post