గోళ్ళపాడు చానల్ ఆధునీకరణ మిగులు పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ గొళ్ళపాడు చానల్ ఆధునీకరణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 13 ఖమ్మం:

గోళ్ళపాడు చానల్ ఆధునీకరణ మిగులు పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ గొళ్ళపాడు చానల్ ఆధునీకరణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. కాల్వబడ్డు, సుందరయ్య నగర్, శ్రీనివాస్ నగర్ ప్రాంతాలలో జరుగుతున్న చానల్ ఆధునీకరణ పనులను కలెక్టర్ పరిశీలించారు. అదేవిధంగా శ్రీనివాసనగర్ మున్నేరు వద్ద మురుగునీటి శుద్దీకరణ ప్లాంట్ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు. భవిష్యత్తులో మురుగునీరు ఎక్కడా కూడా నిల్వకుండా ఉండే విధంగా చానల్ పనులు జరగాలని, స్ట్రక్చర్లను, ఎస్.టి.పి. పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత ఏజెన్సీ బాధ్యులను కలెక్టర్ ఆదేశించారు. మురుగునీరు పైప్ లైన్ల నిర్మాణం, వర్షపునీటి కాలువ నిర్మాణం మురుగునీటి శుద్ధీకరణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అవసరమైనచోట అదనపు లేబర్ను కేటాయించాలని కలెక్టర్ ఆదేశించారు. సీనరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను పూర్తి చేసేందుకు సమగ్ర యాక్షన్ ప్లాన్ సమర్పించాలని. కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పైప్ లైన్ల పనులు పూర్తయిన ప్రాంతాలలో ఫెన్సింగ్ పనులను గ్రీనరీ పనులను, పార్కుల ఏర్పాటు పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. సుందరయ్యనగర్ పార్కును కలెక్టర్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. పార్క్ నిర్వహణ సక్రమంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

నగరపాలక సంస్థ కమీషనర్ అనురాగ్ జయంతి, పబ్లిక్ హెల్త్ డి.ఇ శ్రీనివాసరావు, రాంకీ ఏజెన్సీ బాధ్యులు హన్మంతరాము, పబ్లిక్ హెల్త్ ఏ ఇలు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post