గోళ్ళపాడు చానల్ ఆధునీకరణ ముగింపు పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 23 ఖమ్మం:

గోళ్ళపాడు చానల్ ఆధునీకరణ ముగింపు పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి నగరంలో జరుగుతున్న గోళ్ళపాడు చానల్ ముగింపు పనులు, అమృత్ పథకం కింద జరుగుతున్న మంచినీటి సరఫరా పనుల పురోగతి, నగరంలో ఏర్పాటు చేయనున్న ఫుట్పాత్ జోన్ల పనులపై మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, సంబంధిత ఏజెన్సీ బాధ్యులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గోళ్ళపాడు చానల్ ఆధునీకరణ ముగింపు పనులలో భాగంగా ఇంకనూ పెండింగ్లో ఉన్న పైప్ లైన్, ఎస్.టి.పి, చైన్ లింక్ ఫెన్సింగ్, స్మార్ట్ వాటర్ డ్రైవ్ పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటికే నిర్దేశించిన గడువు పూర్తయినదని, ఇక ముందు పనుల్లో జాప్యం సరికాదని కలెక్టర్ అధికారులను, ఏజెన్సీ బాధ్యులను ఆదేశించారు. ఇప్పటికే పైప్ లైన్ పనులు పూర్తయిన ప్రాంతాలలో ప్రజా అవసరాలకనుగుణంగా వీధి వ్యాపారుల ప్రాంగణాలు, పార్కులు, ఇతర వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు సమగ్ర ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు, పాదచారులకు ఇబ్బంది కలుగకుండా ఇప్పటికే నగరంలో గుర్తించిన ప్రదేశాలలో ఫుట్పాత్ ల  ఏర్పాటుకు టౌన్లైనింగ్, ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా ఆయా ప్రాంతాలలో పర్యటించి సాధ్య ఆసాధ్యాలను గుర్తించి ఫుట్పాత్ల ఏర్పాటుకు సమగ్ర అంచనాలు ప్రణాళికతో పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నగరంలో అమృత్ పథకం కింద జరుగుతున్న మిషన్ భగీరథ ముగింపు పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 18 ట్యాంకులకు గాను 6 ట్యాంకులు మత్రమే పూర్తి స్థాయిలోకి వచ్చాయని, మిగిలిన ట్యాంకుల పనులను మరింత వేగవంతం చేసి వచ్చే నెలలో నగరపాలక సంస్థకు అప్పగించాలని కలెక్టర్ ఏజెన్సీ బాధ్యులను ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే పూర్తయిన పైప్ లైన్ ల పనులలో ఎక్కడకూడా లీకేజ్లు ఉండరాదని, పబ్లిక్ హెల్త్, నగరపాలక సంస్థ. అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని, మిగిలిన పనులు నిర్దేశించిన సమయంలో పూర్తి అయ్యేలా ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్షించాలని నగరపాలక సంస్థ కమీషనరుక్కు కలెక్టర్ సూచించారు.

నగరపాలక సంస్థ పర్యవేక్షక ఇంజనీరు ఆంజనేయప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రంజిత్ కుమార్, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కృష్ణలాల్, డి. ఈలు రంగారావు, శ్రీనివాస్ రావు, స్వరూపారాణి, రాంకీ ఏజెన్సీ బాధ్యులు హన్మంతురాము, ఎల్. ఆండ్.టి ప్రాజెక్టు మేనేజర్ హరిప్రసాద్, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post