ఈ జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్సూమర్ ఫోరమ్ కేసులు, ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు మరియు ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలిపుచున్నాము. కావున ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను పరిష్కరించుకునేలా సిద్దం కావాలని కోరుచున్నాము. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకుని, కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలియజేస్తున్నాము.
రాజీపడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలియజేస్తున్నాము. ఈ జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయుటకు గాను ఇప్పటికే పోలీసు అధికారులతో, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతోనూ, ఎక్సైజ్ శాఖ అధికారులతో, ఇన్సూరెన్స్ అధికారులతోనూ, న్యాయవాదుల తోనూ, బ్యాంకు మరియు చిట్ ఫండ్ మేనేజర్లతో వేరు వేరు సమావేశాలు నిర్వహించి, అధిక కేసుల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాం. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఇతర ప్రభుత్వ అధికారులు సహకరించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇప్పటివరకు మన ములుగు జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ లో గుర్తించబడిన కేసులలో మొత్తం249 పెండింగ్ కేసులను పరిష్కరించుటకు సిద్ధముగా ఉన్నామని తెలియజేస్తున్నాము. వీటిలో ఇప్పటి వరకు 249 కేసులలోని కక్షిదారులకు నోటీసులు జారీ చేసి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశాం. వీటిలో క్రిమినల్ – _220 , ఎన్.ఐ.యాక్ట్ -05, బ్యాంక్ రికవరీ – 8 , ఎం.ఎ.సి.టి. -11 , వివాహ , అదర్ సివిల్ – 5, ప్రీ-లిటిగేషన్ బ్యాంక్ కేసులు -393 .
జిల్లా వ్యాప్తంగా ఈ కేసులను పరిష్కరించుటకు 3బెంచీలను ఏర్పాటు చేయడము జరిగింది. ఈ జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడంలో ములుగు జిల్లా పోలీస్ అధికారులు, ప్రభుత్వ శాఖల అధికారులు, న్యాయవాదుల పాత్ర మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్ర అనిర్వచనీయం. లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైననూ, సందేహాలకైననూ, ఏదేని న్యాయసహాయం కు అయిననూ న్యాయసేవాధికార సంస్థ ను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము.
ఇట్లు
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, ములుగు 💐🙏🏻.