గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం లోని పాఠశాల పల్లి గ్రామంలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో 653 ప్రైవేట్ రంగ ఖాళీల భర్తీకి 6 ప్రముఖ కంపెనీలైన అపోలో ఫార్మసీ, హెటిరో డ్రగ్స్, నవత రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్స్,  పయనీర్ ఎల్యాబ్స్,  స్పందన స్ఫూర్తి ఫైనాన్స్ లిమిటెడ్ హాజరయ్యాయి.
గ్రామంలో జరిగిన జాబ్ మేళాలో 96 మంది  హాజరయ్యారు. ఇందులో నుండి 20 మంది యువతీ యువకులు వివిధ జాబ్ లకు ఎంపిక కావడం జరిగింది. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి గారు జాబ్ మేళాను పర్యవేక్షించారు.  జాబ్ మేళాలో ఎంపిక అయిన 20 మందికి గ్రామ సర్పంచ్ పోగుల ఆంజనేయులు గారితో ఆర్డర్ కాపీలు అందించడం జరిగింది.
జాబ్ మేళా కార్యక్రమంలో  జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీమతి సాహితీ,  ఎస్.సి. కార్పోరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా యువజన సంక్షేమ అధికారి ధనుంజయ్,  అధికారులు పాల్గొన్నారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది.

Share This Post