పత్రిక ప్రకటన
నారాయణపేట జిల్లా
తేది: 15-09-2021
గౌరవ CEO SERP గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ నారాయణపేట గారు జిల్లాలోని SVEP (స్టార్ట్ ఆఫ్ విలేజ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రాం) కార్యక్రమాలపై ప్రాంతీయ వనరుల అభివృద్ధి కేంద్రం మక్తల్ (బ్లాక్ రిసోర్స్ సెంటర్ BRC) మక్తల్ ఊట్కూర్ మరియు నర్వ మండల SERP సిబ్బంది మరియు CRP EPలను రివ్యూ చేయడం జరిగింది, పై మూడు మండలాల్లో ఈ పథకం అమలవుతున్న తీరు మరియు ఆ పథకం అమలులో వెనుకబడిన మండలాల సిబ్బంది ఈ నెల చివరి నాటికి మీ మీ టార్గెట్లను పూర్తి చేసుకోవాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించారు. ఈ పథకం అమలులో బ్యాంకుల నుండి గాని స్త్రీనిధి నుండి గాని ఇలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో DRDO, DPM లు రాము, దామోదర, స్త్రీనిది RM శ్రీనివాస్, మేనేజర్ తిరుపతయ్య, BRC APM నారాయణ, కుటుంబశ్రీ నుండి మెంటర్ శాంత కుమారి గారు, మూడు మండలాల APMలు, CCలు, CRP EPలు మరియు స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్లు పాల్గొన్నారు.
————————————————————————జిల్లా పౌరసంబందల అధికారి ద్వార జరి.