గ్రంధాలయాలను అభివృద్ధి పరచాలి… జిల్లా కలెక్టర్ శశాంక

గ్రంధాలయాలను అభివృద్ధి పరచాలి… జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం

మహబూబాబాద్, డిసెంబర్ 30.

గ్రంథాలయ కార్యకలాపాలను మరింతగా విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రంథాలయ పరితీరును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి పూడి నవీన్ రావు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయ కార్యకలాపాలను మరింతగా విస్తరింపజేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలన్నారు. పిల్లలు వృద్దులు గ్రంథాలయానికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా పాఠకుల మెంబర్షిప్ పెంచాలన్నారు.

జిల్లాలోని అన్ని మండలాలలో గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు దాతలు కూడా సహకరించాలని కలెక్టర్ కోరారు గ్రంథాలయానికి ఇండ్లలో వినియోగించని విజ్ఞాన పుస్తకాలను అందచేయాలన్నారు. గ్రంథాలయ అధికారులు బుక్ డొనేషన్ డ్రైవ్ ను చేపట్టాలని మరిన్ని పుస్తకాలను లైబ్రరీ లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

పాఠకులు గ్రంథాలయానికి వచ్చే విధంగా అన్ని సౌకర్యాలను అంచలవారీగా ఏర్పాటు చేస్తామన్నారు జిల్లాలో 11 గ్రంథాలయాలు ఉన్నాయని అదనంగా మండలాల్లో కావలసిన గ్రంథాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ సమస్య సమావేశంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ జెడ్పిసిఈఓ రమాదేవి పంచాయతీరాజ్ అధికారి సురేష్ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా విద్యాశాఖ అధికారి శ్రీరాములు గ్రంథాలయ సెక్రటరీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Share This Post