గ్రంధాలయాలను అభివృద్ధి పరచాలి

గ్రంధాలయాలను అభివృద్ధి పరచాలి

జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్

0000

     జిల్లా గ్రంధాలయ సంస్థను అభివృద్ధి చెందుతన్న కరీంనగర్ జిల్లాకు ధీటుగా అభివృద్ధి చేయాలని జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు.

     మంగళవారం జిల్లా గ్రంధాలయంలో జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులు, అభివృద్ధికి అనుగుణంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లా గ్రంధాలయ అభివృద్ధికి సరిపడా నిధులను సమకూర్చుకొవాలని పేర్కొన్నారు. సానిటరీ పనుల నిర్వహణకు స్వయం సహాయక సంఘాల నుండి సిబ్బందిని ఏర్పాటు చేసుకువడానికి వేతనం చెల్లించుటకు చర్యలను తీసుకోవాలని పేర్కొన్నారు. గంధాలయానికి తెప్పించిన పుస్తకాలకు చెలింపులు జరుపుట, కొత్త పుస్తకాలను తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి విరబుచ్చయ్య, శ్రీమతి ఏ.సరిత, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శ, సభ్యులు కొడగోటి మొగిలి గారు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post