గ్రామపంచాయతీ నిర్వహణ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర ఉంటుందని, పంచాయతీరాజ్ చట్టం మేరకు అన్ని అంశాలపై అవగాహన తో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాజార్షి షా సూచించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, సెప్టెంబర్ 7:–
 గ్రామపంచాయతీ నిర్వహణ వ్యవస్థలో పంచాయతీ కార్యదర్శులది కీలక పాత్ర ఉంటుందని, పంచాయతీరాజ్ చట్టం మేరకు అన్ని అంశాలపై అవగాహన తో విధులు నిర్వహించాలని అదనపు కలెక్టర్ రాజార్షి షా సూచించారు.
మంగళవారం పాత డి.ఆర్.డి.ఎ కార్యాలయంలోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో కంగ్టి, కల్హేర్, సిర్గాపూర్, నాగలి గిద్ద మండలాల పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజర్షి మాట్లాడుతూ  పంచాయతీ కార్యదర్శులు అన్ని అంశాలపై పూర్తిస్థాయి అవగాహనతో గ్రామాభివృద్ధికి సహకరించాలన్నారు.
ఇట్టి శిక్షణ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ చట్టంలోని ముఖ్య అంశాలు, జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టే విధానం, గ్రామపంచాయతీ పరిపాలన, బడ్జెట్ ,పనులు ఆదాయం, వ్యయాలు, బిల్లుల చెల్లింపు అకౌంట్, ఆడిట్, హరితహారం, నర్సరీలు గ్రామపంచాయతీ రికార్డుల నిర్వహణ, ఇ- పంచాయతీ అప్లికేషన్స్, లే అవుట్ అండ్ బిల్డింగ్ రూల్స్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా అంశాలపై సందేహాలను డిపిఓ సురేష్ మోహన్ నివృత్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఎ ఎపిడి, ఎంపీడీవోలు ఎంపీడీవోలు, నాలుగు మండలాలకు చెందిన 118 మంది పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

Share This Post