గ్రామస్థాయిలో మల్టీ లెవెల్ డిసిప్లీనరీ టీమ్ లను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే నిర్వహించి కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలి – ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

ఇతర దేశాలలో అధిక సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామస్థాయిలో మల్టీ లెవెల్ డిసిప్లీనరీ టీమ్ లను ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే
నిర్వహించి కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

  మంగళవారం హైదరాబాద్ నుండి కోవిడ్  వాక్సినేషన్ పై జిల్లాల కలెక్టర్లు,అడిషనల్ కలెక్టర్లు, జిల్లా పరిషత్  సీఈవోలు, పంచాయతీ  అధికారులు,  వైద్య ఆరోగ్య అధికారులు, ఇతర  సీనియర్ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

  ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో మల్టీ లెవెల్ డిసిప్లీనరీ టీమ్ లను ఏర్పాటు చేయాలని, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ సెక్రటరీలు, వీఆర్ఏలను సభ్యులుగా నియమించాలని అన్నారు. వీరు ఇంటింటి సర్వే నిర్వహించి ఎవరెవరు మొదటి డోసు, రెండు డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎవరు ఇంతవరకు ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోలేదు అని వివరాలు సేకరించి వారందరు వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని
సూచించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిలో స్పెషల్ అధికారులను నియమించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని సూచించారు.

 రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో 22 లక్షల 94 వేల 196 మొదటి డోసు, 12 లక్షల 23 వేల 628 రెండో డోసు, మొత్తం 35 లక్షల 17 వేల 824 కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామస్థాయిలో మల్టీ లెవెల్ డిసీప్లీనరీ టీమ్ లను ఏర్పాటు చేసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇంటింటి సర్వే చేపట్టి, మున్సిపల్ పరిధిలో చేపట్టిన విధంగానే గ్రామ స్థాయిలో చర్యలు తీసుకోని  నవంబర్ 3 వరకు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేస్తామని తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్లు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్య లక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, పిడి డి ఆర్ డి ఎ ప్రభాకర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post