గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుదాం- ఆదిలాబాదు పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు.

సెప్టెంబర్ 04, 2021ఆదిలాబాదు:-

ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దంతన్ పల్లి గ్రామాన్ని ఆదర్శగ్రామం గా మార్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆదిలాబాదు పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు అన్నారు. శనివారం రోజున ఉట్నూర్ మండలం దంతన్ పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా  ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూ, గ్రామం లోని సమస్యల పై ప్రత్యేక ద్రుష్టి సారించి ఆదర్శగ్రామంగా తీర్చి దిద్దడమే తన లక్ష్యామని అన్నారు. గ్రామంలోని సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ప్రధానమంత్రి సంసద్ ఆదర్శ గ్రామ యోజన పథకం కింద దంతన్ పల్లి గ్రామాన్ని ఆదర్శగ్రామం గా మార్చి అభివృద్ధి చేయడం జరుగుతుందని, అధికారులకు గ్రామస్తులు సహకరించి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని, మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ఆశాలు, ANM లతో గ్రామంలో ప్రత్యేకంగా ఫీవర్ సర్వే,  కోవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తామని  అన్నారు. శానిటేషన్, స్ప్రేయింగ్, ప్రతి రోజు జరగడం దోమల వ్యాప్తి జరగకుండా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల రాకుండా ఉంటాయని అన్నారు. గిరిజన గ్రామాల్లోని గర్భిణీలకు, బాలింతలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని మెడికల్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ మాట్లాడుతూ, గ్రామంలో ఏ సమస్యలున్నా పంచాయితీ కార్యదర్శి, సర్పంచ్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. గ్రామసభకు గ్రామస్తులంతా హాజరు కావాలని అన్నారు. ఆసరా పింఛను, ఉపాధి హామీ పథకం కొరకు దరఖాస్తు చేసుకోవాలని, వాటిలో ఏ సమస్యలు ఉన్న తెలియజేయాలని అన్నారు. ప్రతి ఫ్రై డే డ్రై డే నిర్వహించాలని అన్నారు. స్త్రీ నిధి, మహిళా సంఘాలకు రుణాలు అర్హతను బట్టి అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్బంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ, అధిక వర్షాలు వచ్చినపుడు ఇంట్లోకి నీరు చేరుతుందని, కొన్ని ఇండ్లు పైకప్పునుండి వర్షం నీరు వస్తుందని, మిషన్ భగీరథ పైపు లైన్ పనుల కోసం తవ్విన గుంతలను పూడ్చాలని, చెక్ డ్యామ్ కు కాలువ నిర్మించాలని, రోడ్లు, పారిశుద్యం, విద్యుత్, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, మహిళా సంఘాల రుణాలు, ఇతర సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొని వచ్చారు. ఈ కార్యక్రమం లో  జిల్లా గ్రామీణభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఎంపీపీ జైవంత్ రావు, జెడ్పీటీసీ చారులత రాథోడ్, గ్రామ సర్పంచ్ భూమన్న, వివిధ శాఖల అధికారులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post