గ్రామాభివృద్దిలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

గ్రామాభివృద్దిలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన                                                                                                                                                                                                                                      తేదిః 28-08-2021

                                                                                   గ్రామాభివృద్దిలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు  ::  జిల్లా కలెక్టర్ జి. రవి

          జగిత్యాల, అగస్టు 28: గ్రామాలను అందంగా తీర్చిదిద్దడంలో నిర్లక్యం వహిస్తే ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్ రవి గుగులోత్ అన్నారు.  శనివారం జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం శంకరరావుపేటలో పర్యటించి వివిధ పనుల ప్రగతిని పరిశీలించారు.  మొదటగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు, కరోనా కారణంగా ఆన్ లైన్ తరగతులకు పరిమితమైన భోదనను సెప్టెంబర్ 1వ తేది నుండి ప్రత్యక్ష్య తరగతుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని,  విద్యార్థులు చాలాకాలం తరువాత పాఠశాలలకు రానున్న తరుణంలో పాఠశాల, తరగతి గదులు మరియు పరిసరాలలో పరిశుభ్రత, సానిటైజేషన్ కార్యక్రమాలను యుద్ద ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.  ఎక్కడ కూడా చెత్త, పిచ్చిమొక్కలు లేకుండా చూడాలని పేర్కోన్నారు.

అనంతరం పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించి, పాత్ వే కొరకు అనవసరంగా ఎక్కువ స్థలాన్ని వినియోగించడం, ప్రకృతి వనంలో ఎక్కువగా పూలమొక్కలు నాటడం, మొక్కల మద్య గ్యాప్ ఎక్కువగా ఉండటం, ఇంకా మొక్కలను నాటవలసి ఉండటాన్ని గమనించి తక్షణమె మొక్కలను నాటి, పాత్ వే స్థలాన్ని తగ్గించాలని హెచ్చరించారు.  ప్రకృతివనంలొ ఒకే రకమైన మరియు పూల మొక్కలను కాకుండా భవిష్యత్తులో ఉపయోగపడే వివిధ రకాల మొక్కలను నాటాలని పేర్కోన్నారు.  అనంతరం బృహత్ పల్లెప్రకృతివనం కొరకు కేటాయించిన 10 ఎకరాల స్థలంలో చేపడుతున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించి పెద్దగా పెరిగి, ఉపయోగకరంగా ఉండే మొక్కలకే ప్రాదాన్యతను ఇవ్వాలని, గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలలో లేనట్లయితె వేరే ప్రాంతాలలో ఏర్పాటుచేసిన నర్సరీలు, అటవిశాఖ వారి ద్వారా తెప్పించాలని, అవసరమైతే కొనుగోలు చేసి మొక్కలను నాటాలని సూచించారు.   నాటిన ప్రతిమొక్క  సంరక్షించబడాలని, వనాల నిర్మాణాలకు కేటాయించిన స్థలాల్లో ఇప్పటికే పెద్దగా పెరిగిన మొక్కలను తొలగించరాదని, కేటాయించిన స్థలంలో ఉన్న పెద్దరాళ్లపై ఆకర్షణీయమైన బోమ్మలను వెయించి ఆకర్షనీయంగా తీర్చిదిద్దాలని పేర్కోన్నారు.  అనంతరం  గుంతలను తవ్వుతున్న కూలీలతో  మాట్లాడుతూ, పనిగంటలు మరియు ఇస్తున్న కూలీని గురించి వాకబు చేశారు.   గ్రామంలో మొక్కల పెంపకానికి ఎక్కువ ప్రాదాన్యతను ఇవ్వడంతొ పాటు నాటిన ప్రతిమొక్క సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, మురుగుకాలువల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని గ్రామం పరిశుభ్రంగా తయారుచేయాలని ఆదేశించారు.

చివరగా అంగన్ వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి పిల్లలకు అందిస్తున్న గుడ్లు, బాలామృతం, అంగన్ వాడి కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో స్థానికసంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి ఆర్.డి. మాదురి, డిఆర్డిఓ పిడి ఎస్. వినోద్, జిల్లా పంచాయితి అధికారి నరేష్, ప్రత్యేకాధికారి సాయిబాబా, తహసీల్దార్ నవీన్, గ్రామసర్పంచ్  తదితరులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

గ్రామాభివృద్దిలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

గ్రామాభివృద్దిలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post