గ్రామాభివృద్దే దేశాభివృద్ది రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ, అక్టోబర్ 20: గ్రామాల అభివృద్దే దేశాభివృద్ది అని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
బుధవారం దేవరుప్పుల మండలం లో బంజర గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభోత్సవం చేసి మంత్రి మాట్లాడుతూ బంజర గ్రామంచాయతీ కార్యాలయ భవనాన్ని 20. లక్షల వ్యయంతో నిర్మించామని అన్నారు. గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ది చెందుతుందని ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి దేశంలో ఎక్కడలేని విధంగా తండాలను గ్రామ పంచాయతీలుగా చేయటం జరిగిందని, గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, సేగ్రిగేషన్ షెడ్లు, వైకుంఠధామాలు, రైతు వేదికలు, గ్రామ పంచాయతీ కార్యాలయాలు లేని గ్రామాలకు భవన నిర్మాణాలు చేపడుతూ గతంలో ఏ ప్రభుత్వము చేయని అభివృద్ధి పనులు ఈ ప్రభుత్వ హయాంలో జరిగినవని అన్నారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతు వేదికలు, రైతు భీమా, 24 గంటల విద్యుత్తు ఇస్తూ వివిధ పంటలకు మద్దతు ధర కల్పిస్తూ రైతులకు సాగునీరు అందించేందుకు చెక్ డ్యాములు, ప్రాజెక్టులు, నిర్మించిదన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ప్రజలకు రక్షిత మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ ద్వారా కల్పించిందన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా వృద్ధాప్య, వితంతు,వికలాంగులకు, వృద్ద కళాకారులకు, కరోనా సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా వారి వారి ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమచేసామన్నారు. వృద్దాప్య పెన్షన్ కు వయసు అర్హత తగ్గించి కొత్త పించను దరఖాస్తు చేసుకొనుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అన్నారు.అనంతరం పల్లె ప్రకృతి వనం, నర్సరీ ప్రారంభించి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో మొక్క నాటి నీరు పోసారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 32 మందికి 21లక్ష 48వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ కార్యాలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన దాతలను ఘనంగా సన్మానించారు.
జిల్లా కలెక్టర్ సి.హెచ్ శివలింగయ్య మాట్లడుతూ గ్రామాలన్నీ బాగుపడి స్వచ్చంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ మంత్రి గ్రామాల అభివృద్ధి కి అనేక పథకాల ద్వారా నిధులు నేరుగా మంజూరు చేస్తున్నందున గ్రామ ప్రజలు సమన్వయంతో కలిసి పనిచేసి గ్రామాభివృద్దికి తోడ్పడాలని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమనికి ముందు మహర్షీ వాల్మీకి జయంతి సందర్బంగా ఆయన చిత్ర పటానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జనగామ, ఆర్డీవో మధుమోహన్, డిపిఓ కె.రంగాచారి, డిఆర్డీఓ జి.రాంరెడ్డి, జెడ్పి సీఈఓ ఎల్. విజయలక్ష్మీ, ఎంపిపి బస్వ. సావిత్రీ మల్లేశం, స్థానిక జెడ్పిటిసి పల్లవి, బంజర సర్పంచ్ మాలోతు కవిత మధు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post