గ్రామాభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, రైతులు పండించిన చివరి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.

పత్రిక ప్రకటన                                                                    తేది : 25.04.2022.

గ్రామాభివృద్దే రాష్ట్ర  ప్రభుత్వ ధ్యేయమని, రైతులు పండించిన  చివరి ధాన్యం గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు.

సోమవారం  గద్వాల నియోజకవర్గం  ధరూర్ మండల పరిధిలోని  చింతరేవుల గ్రామంలో  ప్రభుత్వం తరఫున  ఐకెపి సెంటర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు.  ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కెసిఆర్  రైతుల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, రైతు బీమా, రైతు బంధు, 24గంటల విద్యుత్ , సబ్సిడీ ద్వారా ఫర్టిలైజర్ , వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, యాసంగి పంట లో లక్ష మెట్రిక్ టన్నులు వరి ధాన్యము వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా రైతులకు మద్దతు ధర 1960/- రూపాయలకు వరి కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. గతంలో వరి ధాన్యాలు వేరే ప్రాంతాలకు వెళ్లి అమ్ముకునేవారని, నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  రైతుల శ్రేయస్సు కొరకు రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని,  ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే వరి ధాన్యాన్ని అమ్మాలని,   తూకం లో 17% తేమ ఉండేలా చూసుకొని ధాన్యం అమ్మాలని తెలిపారు. రైతులు తమ సరైన  బ్యాంక్ ఖాతాను  వ్యవసాయ అధికారులకు ఇవ్వాలని, రైతుల ఖాతాలలోనే  డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామపంచాయతీ అభివృద్ధి కొరకు గ్రామాలలో పారిశుద్ధ కార్మికులు,  డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠ ధాములు ఏర్పాటు చేసి గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని,  గ్రామాభివృద్ధికి గ్రామస్తులు సహకరించాలని, అప్పుడే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. వ్యవసాయ అంటే దండగా కాదు వ్యవసాయం అంటే పండగ అని నిరూపించిన  నాయకుడు కేసీఆర్ అని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ లో  రైతులు అధికారులతో సహకరించాలని కోరారు.

 

ఈ కార్యక్రమంలో  జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ నజూమన్నీసా బేగం, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి,  సర్పంచులు, ఎంపిటిసిలు, కో ఆప్షన్ నెంబర్స్, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 

—————————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి, జోగులాంబ గద్వాల్ గారి ద్వారా జారీ చేయబడినది.

Share This Post