గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

గ్రామాలకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్డు సౌకర్యాన్ని కల్పిస్తున్నమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో పి.ఎం.జి.ఎస్ వై క్రింద షాబాద్ నుండి పాలమాకుల్ కు, నేషనల్ హైవే 44 నుండి నర్కూడ కు, నేషనల్ హైవే 44 నుండి శంకరాపురం కు, కాచరం నుండి జుకల్ కు12 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నాలుగు తారు రోడ్డు నిర్మాణ పనులకు, 4 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి గురువారం రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో కలిసి రాష్ట్ర పంచాయత్ రాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమం అమలు వల్ల గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతున్నాయని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. అనంతరం కొందుర్గ్ మండల కేంద్రంలో 1 కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనానికి , తుమ్మనపల్లిలో 3 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను మంత్రులు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి అనిత హరినాథ్ రెడ్డి , ఎం. ఎల్. సి శ్రీమతి వాణి దేవి, శాసనసభ్యుడు శ్రీ. అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

అనంతరం చింత కుంట తండాలో 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని మంత్రులు ప్రారంభించారు. కొందుర్గ్మండలంలోని గుంజల్ పహాడ్ గ్రామంలో 3 కోట్ల 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు. ఫరుక్ నగర్ మండలంలోని హజేపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని వారు ప్రారంభించారు.

Share This Post