గ్రామాలను అభివృద్ధి పరచాల్సిన బాధ్యత పంచాయితీ కార్యదర్శులపై ఉంది -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సెప్టెంబర్ 08, 2021ఆదిలాబాదు:-

            ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తూ, ప్రజారోగ్యాన్ని సురక్షితంగా ఉంచవలసిన బాధ్యత పంచాయితీ కార్యదర్శులపై ఉంటుందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం రోజున జిల్లా వనరుల కేంద్రంలో ఇచ్చోడ క్లస్టర్ పరిధిలోని పంచాయితీ కార్యదర్శులు, ఎంపీఓ లు, ఎపిఓ లు, ఎంపీడీఓ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రూప్ ల చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందనే ఆకాంక్షతో క్లస్టర్ ల వారీగా సమావేశాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నదని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయితీ కార్యదర్శుల సమస్యలు తెలుసుకోవడం, వృత్తి రీత్యా వారికీ కావలసిన సలహాలు, సూచనలు అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలకు ముఖ్యమైన వ్యక్తి పంచాయితి కార్యదర్శి అని, పంచాయితీ కార్యదర్శి ద్వారా గ్రామాల అభివృద్ధి జరగడం తో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చిట్టా చివరి పేద వర్గాల వారికీ చేరవచ్చని అన్నారు. పంచాయితీ కార్యదర్శులకు కావలసినవి సమకూర్చడం, అందించడం జిల్లా పరిపాలన అధికారుల బాధ్యత అని అన్నారు. ఇలాంటి సమావేశాలు నిర్వహించి గ్రామ, మండల, జిల్లా లను మోడల్ గా చేయడమే లక్ష్యమని అన్నారు. జిల్లాలో యువశక్తిగా ఉన్న పంచాయితీ కార్యదర్శుల ద్వారా జిల్లా శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణకు హరితహారం, కోవిడ్ వ్యాక్సినేషన్ వంటి కార్యక్రమాలు గ్రామాలలో సమర్థవంతంగా అమలు పరచాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ పై ప్రజలకు అవగహన కల్పిస్తూ వ్యాక్సిన్ తీసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆయా బాషలలో అర్ధమయ్యే విధంగా వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం గ్రామాలలో చేపట్టే ప్రభుత్వ కార్యక్రమాలు అమలు బాధ్యత పంచాయితి కార్యదర్శులపై ఉందని అన్నారు. పంచాయితీ కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం 7 గంటలకు విధిగా విధులకు హాజరు కావాలని, పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించిన నివేదికలు మధ్యాహ్నం 3 గంటల లోపు సమర్పించాలని అన్నారు. పంచాయితీ కార్యదర్శులు వారి కుటుంబ సభ్యులు కోవిడ్ వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలని, అదేవిధంగా గ్రామం లోని సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు, మల్టి పర్పస్ వర్కర్లు, గ్రామస్తులు వాక్సిన్ తీసుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. పారిశుధ్య కార్యక్రమాలకు సంబంధించి తప్పని సరిగా ప్రతి రోజు నిర్వహించాలని, నాళీలు, రోడ్లను శుభ్రపరచడం జరగాలని అన్నారు. దుకాణాలు, కంపెనీలు, హోటల్ లు, పాన్ డబ్బాలు, తదితర వ్యాపార ప్రాంతాలలో చెత్త రోడ్లపై వేసిన వారి నుండి అపరాధ రుసుము వసూలు చేయాలనీ సూచించారు. మల్టి పర్పస్ వర్కర్లకు జీవిత భీమా సౌకర్యం కల్పించాలని, వచ్చే అక్టోబర్ 2 లోగా ఈ ప్రక్రియ పూర్తీ చేయాలనీ అన్నారు. గ్రామాలలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ, వైద్య సిబ్బంది తో సమన్వయము చేసుకోవాలని అన్నారు. జాతీయ రహదారికి ఇరువైపులా మల్టి లేయర్ ప్లాంటేషన్ నిర్వహిస్తున్నందున మొక్కల ఎదుగుదలకు వాటరింగ్ ఆయా పంచాయితీలు నిర్వహించాలని అన్నారు. గ్రామాలలో చేపట్టే మంచి పనులకు సంబంధించిన విషయవివరాలను ట్విట్టర్ లో పోస్ట్ చేయాలనీ, అవసరమైన పక్షంలో వీడియో లు, సృజనాత్మక అంశాలను రూపొందించి ట్విట్టర్ లో పోస్ట్ చేయాలనీ సూచించారు. ప్రతి 45 రోజులకు ఒకసారి పంచాయితీ కార్యదర్శుల పని తీరును సమీక్షిస్తూ, ఇద్దరు ఉత్తమ పంచాయితీ కార్యదర్శులను ఎంపిక చేసి రివార్డ్ లను అందిస్తామని తెలిపారు. వినాయక చవితి సందర్బంగా మట్టి వినాయకులను స్థాపించి పూజ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, ప్లాంటేషన్, ఉపాధి హామీ పనులకు సంబంధించిన చెల్లింపులు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలనీ అన్నారు. ఖాళీ స్థలాల్లో మల్టి లేయర్, మూడు, నాలుగు లైన్ ల వరుసలలో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రామాలలో పారిశుద్యం నిర్వహణ, పచ్చదనం పెంపకం, క్లోరినేషన్, డ్రై డే నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, ఇంకుడు గుంతల నిర్మాణాలు నిర్మాణాలు, ఫాగింగ్, వంటి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ప్రతి రెండు మాసాలకు ఒకసారి గ్రామ సభలు నిర్వహించి చర్చించిన అంశాలకు సంబంధించిన నివేదికలు సమర్పించాలని అన్నారు. గ్రామాల్లో చేపట్టే కార్యక్రమాలను పరిశీలించేందుకు పరిశీలకులు రావడం జరుగుతుందని తెలిపారు. గ్రామాల అభ్యుదయానికి పంచాయితీ కార్యదర్శులు నిర్విరామంగా కృషి చేయాలనీ అన్నారు. ఈ సమావేశం లో జిల్లా పరిషత్ సీఈఓ గణపతి, డివిజనల్ పంచాయితీ అధికారి ధర్మరాణి, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, ఎపిఓ లు, పంచాయితీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

…………………………………………………………….. జిల్లా పౌర సంబంధాల అధికారి, ఆదిలాబాదు గారిచే జారీ చేయనైనది.

Share This Post