గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం లో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు.

జోగులాంబ గద్వాలజిల్లా

 

గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడం లో సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి కీలక పాత్ర పోషించాలని జిల్లా అదనపు కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులకు ఆదేశించారు.

శనివారం ఐజ మండలంలోని పులికల్, రాజాపూర్, బైనిపల్లె, కొత్తపల్లి గ్రామాలలో పర్యటించి గ్రామపంచాయతీ కార్యాలయాలు , ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. పులికల్లు గ్రామం లోని గ్రామపంచాయతీ భవనాన్ని పరిశీలించి ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ ద్వారా మంజురైన నిదుల నుండి  నూతన భవన నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న సర్పంచ్,  పంచాయతి కార్యదర్శికి ఆదేశించారు. గ్రామంలో రోడ్లపై మురుగు నీరు చేరడం పట్ల అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దాలని, రోడ్లపై మురుగు నీరు  రోడ్ల పైకి రాకుండా శాశ్వత పరిష్కారం చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.  అదేవిదింగా  జడ్పీ హైస్కూల్ ను సందర్శించి పాఠశాల గదులను పరిశీలించారు. ఉపాధ్యాయులు సకాలంలో విధులకు హాజరై విద్యాబోధన చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత గా వండాలని వంట వారికి తెలిపారు. రాజాపూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేశారు. పిల్లలకు సరైన పోషకాహారం అందజేయాలని అంగన్వాడి టీచర్లకు  ఆదేశించారు. పోషకాహార లోపం గల బాల, బాలికలను గుర్తించి వారికి మెరుగైన బాలామృతం అందజేయాలన్నారు. రక్త హీనత కలిగి ఉన్న పిల్లలకు గుర్తించి డాక్టర్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇప్పించాలని అంగన్వాడి టిచర్లకు ఆదేశించారు.

అదనపు కలెక్టర్ తో పాటు  ఎంపీడీవో సాయి ప్రకాష్, ఎం పి ఓ  నరసింహా రెడ్డి, గోవర్దనమ్మ  గ్రామాల సర్పంచులు  పంచాయతి సెక్రటరి లు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post