గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలి : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

శనివారం హైదరాబాదు నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, గ్రామీణభివృద్ది,పంచాయితీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పారిశుద్యం, పచ్చదనం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, గ్రామపంచాయితీలకు ట్రాక్టర్ లను సమకూర్చడం వంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని అన్నారు.
గ్రామాలలో చేపట్టిన కార్యక్రమాలపై గ్రామసభలు నిర్వహించి ప్రజలకు వివరించాలని, ముఖ్య కూడళ్లు, గ్రామపంచాయితీ ముందు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా, మండల పంచాయితీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.
గ్రామాలలో అందిస్తున్న ఆసరా ఫించన్ ల సంఖ్య , నెల నెల అందిస్తున్న నగదు వివరాలను, రైతు బంధు, రైతు భీమా, కెసిఆర్ కిట్, మిషన్ భగీరథ, పంచాయితీ భవనాల నిర్మాణాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ వంటి కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను బోర్డు లపై నమోదు చేయాలనీ అన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గ్రామపంచాయితీల ట్రాక్టర్ ల ద్వారా పంచాయితీ ఆదాయాలు పెరిగాయని, అట్టి నిధుల మేరకు అవసరమైన పనులు చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో నిర్మించిన వైకుంఠధామలను వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. వైకుంఠధామానికి వెళ్ళడానికి రోడ్లను, ఫెన్సింగ్, నీటి సరఫరా, విద్యుత్, మరుగుదొడ్ల ఏర్పాటు
తదితర మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

అనంతరం జిల్లా ఆదనపు కలెక్టర్ రాహుల్ శర్మ అధికారతో మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రివర్యులు సూచించిన ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని పనిచేయాలని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వివిధ పనులు పెండింగ్ లో ఉండకుండా వేగవంతంగా పనులు చేసి పూర్తి చేయాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా నుండి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కృష్ణన్, జిల్లా పంచాయితీ అధికారి తరుణ్, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, డివిజనల్ పంచాయతీ అధికారులు శంకర్ నాయక్, అనిత, ఎంపీ వోలు, సీసీలు పాల్గొన్నారు.

Share This Post