గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు

గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాదు నుండి అదనపు కలెక్టర్లు, పంచాయతీ రాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పారిశుధ్యం, పచ్చదనం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్పల్లే పకృతి వనాలు ,క్రీడా ప్రాంగణాలు, వైకుంఠధామాలు, గ్రామపంచాయతీలకు ట్రాక్టర్ల సమకూర్చడం వంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగిందని మంత్రి అన్నారు. గ్రామాలలో చేపట్టిన కార్యక్రమాలపై గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు వివరించాలన్నారు. గ్రామాలలోని ముఖ్య కూడళ్లలో గత ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలపై బోర్డులలో వివరంగా పెట్టాలన్నారు. గ్రామాలలో నిర్మించిన వైకుంఠధామాలను వినియోగం లోకి తేవాలని మంత్రి పేర్కొన్నారు. వైకుంఠధామాలకు వెళ్లడానికి రోడ్లను, ఫెన్సింగ్, నీటి సరఫరా, విద్యుత్తు, మరుగుదొడ్ల ఏర్పాటు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాలలో సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని మంత్రి అన్నారు. అధికారులు అన్ని గ్రామ కూడల్లలో అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని అట్టి బోర్డులను జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, జడ్పీ సీఈఓ సురేష్, డి ఆర్ డి ఓ పి డి కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఎంపీ ఓలు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post