గ్రామాలలో నిర్వహించే వి.సి.పి.సి (విల్లెజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) సమావేశాలలో అందరు స్పెషల్ అధికారులు, ప్రదానోపాధ్యులు, ఎం.ఈ.ఓ లు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రికా ప్రకటన                                                             తేదీ 13.12.2021

గ్రామాలలో నిర్వహించే వి.సి.పి.సి (విల్లెజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ) సమావేశాలలో అందరు స్పెషల్ అధికారులు, ప్రదానోపాధ్యులు, ఎం.ఈ.ఓ లు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ మండల స్థాయిలో అధికారులు (VCPC) సమావేశాలు నిర్వహించి , బాలల సమస్యల పై చర్చించి, సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని అన్నారు. డ్రాప్ అవుట్ అయిన పిల్లలను తిరిగి పాటశాలలకు పంపించేలా వారి తల్లితండ్రులకు అవగాహన కల్పించాలని, స్కూల్స్ లో విద్యార్థుల హాజరు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తల్లితండ్రులు పిల్లలకు ఇతర పనులు చెప్పకుండా చదువు పైనే దృష్తి పెట్టెలా వారికి అవగాహన కల్పించాలని అన్నారు.  సమావేశాలలో సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, తల్లితండ్రులు కుడా సమస్యల పై మాట్లాడాలని అన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న మహిళల పై లైంగిక వేధింపులు నిరోధించడానికి మరియు వారికి అనుకులామైన పని ప్రదేశాన్ని కల్పించాలనే ఉద్దేశం తో ప్రభుత్వం మహిళల పై లైంగిక వేధింపులు నిరోధక చట్టం  2013 తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం ప్రకారము సంఘటిత, అసంఘటిత రంగాలు  పని చేసే చోట 10 అంతకంటే ఎక్కువ మంది వర్కర్స్ పని చేస్తున్నట్లయితే అక్కడ మహిళల పై లైంగిక వేధింపులు నిరోధించడానికి అంతర్గత పిర్యాదుల కమిటీ లు ఏర్పాటు చేయాలనీ , కార్యాలయం లోని ప్రతి అధికారి వ్రాతపూర్వక ఉత్తర్వ్యుల ద్వారా అంతర్గత పిర్యాదుల కమిటీ గా పిలవబడే కమిటీ ని ఏర్పాటు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి ముశాయిధ బేగం  అధికారులందరికీ వివరించారు. ఈ చట్టం ప్రకారం అంతర్గత కమిటీ లో కనీసం నలుగురు సభ్యులు ఉండాలని, కమిటీ లో లీగల్ పరిజ్ఞానం కలిగిన ఒక సీనియర్ మహిళా ఉద్యోగిణి చైర్మన్ గా ఉండాలని , సామాజిక పరిజ్ఞానం కలిగిన ఇంకో మహిళా ఉద్యోగిని ఉండాలని, ఇంకొకరు స్వచ్చంద సంస్థల సభ్యులై ఉండాలని తెలిపారు. పని చేసే చోట  సిబ్బంది కి అధికారి చట్టం పై అవగాహన కల్పించాలని అన్నారు.

అనంతరం ప్రజావాణి లో జిల్లాలో  వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి  పిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణి పిర్యాదులు మొత్తం 30  వచ్చాయని, ఎక్కువగా భూ సమస్యలు, ఆసరా పెన్షన్ లకు,  సంబంధించినవి వచ్చాయని తెలిపారు.  వివిధ అంశాల పై వచ్చిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తామని పిర్యదుదారులకు హామీ ఇచ్చారు.

సమావేశం  లో అదనపు కలెక్టర్ లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, జిల్లా అధికారులు , తదితరులు పాల్గొనారు.

—————————————————————————–

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయబడినది.

 

Share This Post