రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిలో ఉన్న పనులన్నీ ఈ మార్చి లోగా పూర్తి చేయాలని, అందుకు అధికారులంతా సమన్వయంతో కలిసికట్టుగా పని చేయాలని, ఉన్నతాధికారులంతా క్షేత్ర పర్యటనలు చేసి, పనులను పర్యవేక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు.రాష్ట్రంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి పథకాల పనితీరు, ప్రగతిపై హైదరాబాద్ లోని తన పెషీ నుంచి జిల్లాల అడిషనల్ కలెక్టర్లు, డిఆర్డిఓ,డిపిఓ,ఎంపిడీఓలు, ఇంజనీరింగ్ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,కరోనా 3వ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి పారిశుద్ధ్యంపై రాజీ లేకుండా,పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా,ఉధృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పారిశుద్ధ్యాన్ని కొనసాగించాలని, గత కరోనా సీజన్లలో పంచాయతీ సిబ్బంది,అధికారుల పనితీరు అద్భుతంగా ఉందని, ఆ ఫ్రంట్ వారియర్ స్ఫూర్తిని కొనసాగించాలని మంత్రి సూచించారు.మొదటి విడత వ్యాక్సినేషన్లలో రాష్ట్రం వందకు వంద శాతం సక్సెస్ సాధించిందని, రెండో విడత కూడా పూర్తి చేయాలని చెప్పారు.పరిశుభ్రతను పాటించాలని, ప్రజల్ని చైతన్యం చేయాలి. ట్రాక్టర్, ట్రాలీలతో చెత్త సేకరణ ప్రతి నిత్యం జరగాలి. డంపింగ్ యార్డులలో తడి,పొడి చెత్తలను వేరు చేసి,ఎరువుల తయారీ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నారు.ప్రతి రోజూ గ్రామ కార్యదర్శులు 7గంటల కల్లా విధుల్లో ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వంద శాతం వైకుంఠ ధామాలు పూర్తి చేయడం అభినందనీయమని, వాటన్నింటినీ వెంటనే వినియోగంలోకి తేవాలని సూచించారు.పల్లె ప్రకృతి వనాలు, బృహత్ ప్రకృతి వనాల స్థలాలు ఎక్కడైనా గుర్తించకపోయి ఉంటే, వెంటనే గుర్తించాలని సూచించారు. ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని,లేబర్ మొబిలైజేషన్, కొత్త కార్డుల జారీ అంశాలను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.
ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య,డి ఆర్ డి ఓ క్రిష్ణన్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీపీవో మల్లారెడ్డి, dlpo అనిత పంచాయతీ రాజ్ DE మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.