గ్రామాలలో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలన్న జిల్లా కలెక్టర్ బి.గోపి

గ్రామాలలో 100% వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ బి.గోపి

సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్ పై మెడికల్ సిబ్బంది తో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాలు,గ్రామాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం 100% పూర్తి చేయాలని కలెక్టర్ మెడికల్ అధికారులను ఆదేశించారు.

వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

గ్రామాల వారీగా వ్యాక్సినేషన్ ఎంత శాతం పూర్తయిందో నివేదికలు అందజేయాలని కలెక్టర్ సూచించారు .

ప్రతి ఒక్కరూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు.

గ్రామాలలో ప్రజాప్రతినిధుల సహకారంతో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి అయ్యేలా చూడాలన్నారు .
వ్యాక్సినేషన్ వేసుకోని వారిని సర్పంచులు, ప్రజాప్రతినిధుల ద్వారా ఫోన్ చేపించి వ్యాక్సినేషన్ కు వచ్చే విధంగా చేయాలన్నారు .

అధికారులు వ్యాక్సినేషన్ వెళ్లే గ్రామాలలో ముందుగానే టాంటాం వేయించి ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకట రమణ, డాక్టర్ ఎం గోపాల్ రావు, డి ఐ ఓ డాక్టర్ ప్రకాష్, వైద్య అధికారులు సంబంధిత శాఖ సహాయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post