గ్రామాలలో 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని, వరి కొనుగోలు లో ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందిగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

పత్రిక ప్రకటన                                                     తేది: 04-12-2021

గ్రామాలలో 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని, వరి కొనుగోలు లో ఎలాంటి అవకతవకలు లేకుండా పకడ్బందిగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.

శనివారం జిల్లాలోని గట్టు మండలం  ఆలూరు, రాయపురం, గట్టు గ్రామాలలో పర్యటించారు. ఆలూరు మరియు గట్టు మండల పరిదిలో ఉన్న ప్రైమరీ అగ్రికల్చరల్ కోపరేటివ్  సొసైటీ అధ్వర్యంలో  వరి కొనుగోలు కేంద్రాలను  పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలలో టార్ఫలిన్లు, గన్ని బ్యాగులు, ప్యాడి క్లీనర్లు, తేమ శాతం గుర్తించే మెషిన్ లు, అందుబాటులో  ఉంచాలని, పరికరాలు అన్ని పని చేస్తున్నాయో లేదో ముందే చెక్ చేసుకోవాలని అన్నారు.  రైతుల ఫోన్ నెంబర్లకు తప్పనిసరిగా ఆదార్ లింక్ చేయాలనీ , తేమ శాతం 17% ను మించకుండా చూసుకోవాలని  తెలిపారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టిన తరవాతే కేంద్రానికి తీసుకురావాలని అన్నారు. టోకెన్లు జారి చేశారా, ఆదార్ లింక్ చేశారా అని వివరాలను సెంటర్ ఇంచార్జ్ లను అడిగి తెలుసుకున్నారు. టార్ఫలిన్లు, మోయిశ్చరైజెర్లు, గన్నిబ్యాగు లు కేంద్రాలలో పూర్తి స్థాయి లో అందుబాటులో ఉండేలా సెంటర్ ఇంచార్జ్ లు చూసుకోవాలని అన్నారు.

రాయపురం గ్రామంలోని వాక్సినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. ఆశలు, ఎ.ఎన్.ఎం లు గ్రామం లో ప్రజలకు ఇంటింటికి తిరిగి వాక్సినేషన్ పై అవగాహన కల్పించాలని,  ప్రజలందరు వాక్సిన్ వేసుకునేలా చూడాలని, వాక్సినేషన్ ప్రక్రియ ను వేగవంతం చేసి  గ్రామం లో  వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఇంకా మిగిలిన వారు గ్రామం లో ఎంత మంది  ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న మహిళా వ్యాక్సిన్ వేసుకోలేదని తెలుపగా ఆమెకు వ్యాక్సిన్ పై అవగాహన కల్పించి  స్వయంగా వ్యాక్సిన్ వేయిoచారు. ఇప్పటి వరకు ఎంత మంది వాక్సిన్ వేసుకున్నారు, ఇంకా ఎంత మంది మిగిలి ఉన్నారు , మొదటి డోస్ ఎంత మందికి వేసారని, వివరాలు    అడిగి తెలుసుకున్నారు. పి.ఎచ్ సి పరిధిలో 100 శాతం వాక్సినేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని అన్నారు. వలస వచ్చిన వారిని గుర్తించి వారందరికీ వాక్సిన్ వేయాలని సూచించారు.     గ్రామ ప్రజలతో మాట్లాడి వాక్సిన్ వేసుకున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. 18 సంవత్సరాలు  పూర్తి అయిన వారందరికీ వాక్సిన్ వేసి 100 శాతం వాక్సినేషన్ పూర్తి చేయాలనీ అధికారులకు సూచించారు.

అనంతరం గట్టు మండల  తహసిల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యాలయానికి సంబంధించిన ద్రువపత్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కార్యాలయం లో అన్ని రికార్డు లను పరిశీలించారు. గ్రామం లో మొత్తం ఎంతమంది పట్టధారులు ఉన్నారో చెక్ చేయాలని , ధరణి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు. ప్రభుత్వ భూములు, పట్టా భూములు, సర్వే నెం. ల ప్రకారం చెక్ చేయాలని అన్నారు. మ్యూటేషన్స్, సక్షేషణ్, జి.ఎల్.ఎం లను పెండింగ్ ఉంచకుండా ఎంక్వయిరీ చేసి రెడీ గా ఉంచుకోవాలని అన్నారు. రిజిస్ట్రేషన్లు ఎన్ని పెండింగ్ ఉన్నాయని, ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు సర్వే ప్రకారం చేయాలని అన్నారు. సర్పంచులతో మాట్లాడి ప్రభుత్వ భూములలో మొక్కలు నాటించాలని అధికారులకు ఆదేశించారు.

కలెక్టర్ గారితో పాటు   డి యం ప్రసాద రావు, జిల్లా పౌర సరఫరాల అధికారి రేవతి, డాక్టర్ రాజసింహ, తహసిల్దార్ అహ్మద్ ఖాన్, ఎ.ఇ.ఓ లు, ఎంపిడిఓ  రాఘవ  ,  సంబందిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్ గారి చె జారి చేయబడినది.

 

Share This Post